ప్రభుత్వం మారిన 5 కేజీల బియ్యమేనా
ఆంధ్రప్రదేశ్‌లో పౌరసరఫరాల శాఖ ద్వారా నిరుపేదలకు ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున రాష్ట్ర ప్రభుత్వము ఇస్తుండేది. దానితోపాటు కేంద్ర ప్రభుత్వము ఐదు కేజీల ఉచిత బియ్యము ఇచ్చేది గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఉచిత బియ్యము మాత్రమే ఇచ్చేవారు. ప్రభుత్వము మారగా పేద ప్రజలు మా రాతలు మారుతాయి అనుకున్నారు. కానీ నేటి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వము ఇస్తున్న ఉచిత బియ్యము మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకున్నారు. దీని ప్రభావము పేద ప్రజల జీవితాలపై పడుతుంది. దానితోపాటు ఇచ్చే అర్థ కేజీ చక్కెర కూడా మట్టుమాయమైనది. కావున ప్రభుత్వము చేపట్టే కార్యక్రమము లో గొప్ప కార్యక్రమము పౌరసరఫరాల ద్వారా బియ్యం, కందిపప్పు, నూనె, జొన్నలు, సరఫరా చేసి నిరుపేదలను ఆదుకుంటారని ప్రజలు కోరుకుంటున్నారు.