ఇది ప్రజాపాలనా.. లేక చేతగాని పాలనా? – బీఆర్ఎస్ vs కాంగ్రెస్..!
Is it a democratic rule.. or a tyrannical rule? – BRS vs Congress..!
Is it a democratic rule.. or a tyrannical rule? – BRS vs Congress..!
వాయిస్ టుడే: హైదరాబాద్
ప్రతినిధి
హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని, కనుక ప్రభుత్వం అలెర్ట్ ఉండాలని తెలియజేసింది… కానీ, రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. ఎలాంటి ముందుజాగ్రత్తలు లేవు. స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవు.. ! రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు – ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రపు సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడు.
జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీప్ మినిస్టర్ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడు అని అధికార X లో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరదతో ఇల్లు నీట మునిగితే.. చంటి పిల్లలతో ప్రజలు రాత్రంతా రోడ్డు మీద జాగారం చేశారు… మాకు న్యాయం చేయండి అని మంత్రిని అడిగితే పోలీసులను పెట్టి కొట్టించారు. తన తండ్రిని కళ్ళ ముందే పోలీసులు కొడుతుంటే పసిపిల్లలు డాడీ డాడీ అని ఏడవడం అందరిని కలిచివేసింది. ఇది ప్రజాపాలనా.. లేక చేతగాని పాలనా? ఆ చిన్నారి వేదనకు ఎవరిది బాధ్యత? అని BRS పార్టీ కాంగ్రెస్ పై విరుచుకుపడింది.
మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల జీవితాల్లో ఏం మార్పు తీసుకురాలేదు.. కానీ కాంగ్రెస్ నాయకుల మాటల్లో మాత్రం ‘మార్పు’ స్పష్టంగా కనిపిస్తుంది. వరద బాధితులకు ఎక్స్రేషియా విషయంలో మాట మార్చి ప్రజలను ఏమారుస్తున్న రేవంత్ అని BRS పార్టీ అధికార ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.. అధికారంలో లేనప్పుడు 25 లక్షలు డిమాండ్ చేసిన రేవంత్ అధికారంలోకి రాగానే అందరిలాగే 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం ఏంటి.. మాట మార్చడం లో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని…. వరద మృతుల కుటుంబాల ఎక్స్ గ్రేషియాపై అప్పుడొక మాట – ఇప్పుడొక మాట ఏంటి అని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నటన.. అధికారంలోకి వచ్చాక నయవంచన! ఇదీ.. కాంగ్రెస్ నాయకుల తీరు. సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డలకు విజ్ఞప్తి.. చేస్తూ ప్రతిపక్ష BRS పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. మీరు డిమాండ్ చేసినట్టుగానే వరద బాధితులకు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచాలని.. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30 వేల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని రేవంత్ దృష్టికి తీసుకురావాల్సిందిగా బలంగా BRS పార్టీ కోరుకుంటుంది అని అన్నారు.
కాంగ్రెస్ బదులు ఇస్తూ చేసిన కామెంట్స్…
వీలైతే ప్రజల మధ్యకు వచ్చి సాయం చేయండి. లేదంటే ఫేమ్ హౌస్ లో మౌనంగా ఉండండి. విదేశాల్లో విలాసవంతంగా తిరుగుడో చేయండి అని సిఎం రేవంత్ బదులు ఇచ్చాడు…
ఖమ్మం సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ..
భారీ వర్షాల వల్ల జనజీవితం అతలాకుతలం అయింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. భారీ వర్షాల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షేత్రస్థాయి నష్టాలను పరిశీలించేందుకు వచ్చాను. ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసం కల్పిస్తున్నాం. వరదల కారణంగా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలి. తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించాం. భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి సాయం కోరాం. తక్షణమే జాతీయ విపత్తు గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వర్షాల వల్ల రాష్ట్రంలో 5438 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ లో పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశాను ఇది కష్ట సమయం.
BRS పార్టీ నీ ఉద్దేశించి.. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల దగ్గర కు వెళ్తున్నారు. తెలంగాణ లో ప్రతిపక్ష నేత మౌన ముద్ర దాల్చారు. కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ మంత్రులు పనిచేయడం లేదంటు విమర్శలు చేస్తున్నారు. జాతీయ విపత్తు గా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం మేము పనిచేయం. వర్షాల కారణంగా జనం సర్వం కోల్పోయారు. ప్రజలకు చిల్లిగవ్వ కూడా కల్వకుంట్ల కుటుంబం ఇవ్వదు. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ. లక్షల కోట్ల సొమ్ములో రూ. వెయ్యి కోట్లో.. రూ. రెండు వేల కోట్లో బాధితులకు సహాయంగా ఇవ్వవచ్చు కదా? అని రేవంత్ అన్నారు.
చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తాం. పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 10 వేలు పరిహారం ఇస్తాం. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.పదివేలు ఇస్తున్నాం. తక్షణ అవసరాల కోసం జిల్లా ల కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్లు వేశాం. వరదలపైన గత ప్రభుత్వం ఒక పాలసీ ని కూడా రూపొందించలేదు. రాష్ట్రంలోని యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశాం.