Thursday, December 12, 2024

సోనియా గాంధీని బలిదేవతన్నది రేవంత్ రెడ్డి కాదా..?

- Advertisement -

సోనియా గాంధీని బలిదేవతన్నది రేవంత్ రెడ్డి కాదా..?

ఇండో పాక్ యుద్దల్లో సైనికులకు ఆర్ఎస్ఎస్ సేవలు

నిజాలు చెప్పని జీవన్ రెడ్డి అంకుల్

ఎన్నికల్లో ఓడినా జీవన్ రెడ్డికి మంత్రి పదవి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి

జగిత్యాల,
ఎంపీగా జీవన్ రెడ్డి అంకుల్ కు టికెట్ దక్కి పోటీలో ఓడితే రాష్ట్రంలో మంత్రి పదవి దక్కుతుందని, మోడి ప్రభంజనంతో ఎంపీ అరవింద్ కచ్చితంగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు.మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కమలా నిలయంలో శ్రావణి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వాఖ్యల పై ఫైర్ అయ్యారు..ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ, జగిత్యాలలో బీజేపీ సంకల్ప యాత్ర ముగియక ముందే ఎక్కడ ఒడిపోతనోననే భయం తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారని ఎద్దేవా చేశారు. ఇందీరా గాంధీ అపర కాళిక అని తాను అనలేదని వాజ్ పాయ్ మీడియా కు చెప్పిన వీడియో చూడలని చురకలంటించారు. మీ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత సీఎం రేవంద్ రెడ్డి బలి దేవత అని సంభోందించిన విషయాన్ని మరిచిపోయారని మండిపడ్డారు. అప్పటి యువ నాయకుడు అరవింద్ అన్న చెరుకు రైతుల కోసం పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజ శేఖర్ రెడ్డి హాయం లో వేసిన హౌజ్ కమిటి లో జీవన్ రెడ్డి మెంబర్ గా ఉండి రైతుల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దశాబ్దాల కాలం లో రైతులకు లబ్ది చేయని మీరు ఇప్పుడు చేస్తామని చెపితే ప్రజలు నమ్మె పరిస్థితి లో లేరన్నారు. మీ గత చరిత్ర విప్పితే బాగుండదని..? మేం ఎం చేశామో ప్రజలకు చెప్పేందుకు పక్క లెక్కలు ఉన్నాయని తెలిపారు. ఉగ్ర వాదులకు అడ్డగా మారకుండా జగిత్యాల ను చూసుకుంటే చాలాలన్నారు. ఆదాని, అంబానీలు బీజేపీ పాలన లో ఎదిగినట్లు మాట్లాడుతున్నారని, చరిత్ర లో ఇందీరా గాంధీ, రేవంద్ రెడ్డి ఎందుకు వెళ్లి వంగి వంగి ఫోటోలు దిగారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన లో చేసిన యుద్ధాలలో ఆర్ఎస్ఎస్ ప్రధాన పాత్ర ను అప్పటి పీఎం నెహ్రూ గుర్తించి పరేడ్ లో కితాబు ఇచ్చారని చెపుతుందని చెప్పారు. పీఎం మోడి కిషన్ సమ్మాన్ యోజన కింద రైతుల కోసం పెట్టుబడి సాయం, యూరియా పై  మొత్తంగా ఏడాదికి సబ్సిడీ వంటి 24 వేల విలువ చేసే సబ్సిడీ అందజేస్తున్నారని తెలిపారు. ఎంపీ అరవింద్ అన్న బాండ్ పేపర్ హామీ మేరకు పసుపు బోర్డు మంజూరు చేశారని, క్వింటాల్ కు రూ. 13 వేలు పలుకుంతుందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 18 లక్షల మందికి ఉచితంగా పీడీఎస్ రైస్, 4 కోట్ల మంది పేదలకు ఇండ్లు, 6 లక్షల పేదలకు ఆయూష్మాన్ భారత్ కార్డులు, 70 వేల మంది సుకన్య యోజన కార్డు దారులు, 6 వేల కోట్ల రుణాలు మహిళా సంఘాలకు రుణాలు, వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, ముద్రా లోన్లు మంజూరైయ్యాన్నారు. అరవిందన్న ప్రత్యేక చొరవ తో రూ. 3500 కోట్ల తో ఆర్మూర్ టూ మంచిర్యాల్ 4 లైన్స్ రోడ్డు, 53 వేల కోట్ల తో రైల్వే స్టేషన్ అధునీకరణ పనులు జరుగుతున్నాయని వివరించారు. జగిత్యాల జిల్లా కు నవోదయ స్కూల్ సాంక్షన్ అయిందని, గ్రామీన్ సడక్ యోజన్ కింద 80 గ్రామాలను కలిపేలా 22 రోడ్లు మంజరు చేశాం.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని చెప్పారు. మహా కాళేశ్వర్ కారిడార్, కాశీ కారిడార్, రామాలయ నిర్మాణం మోడీ హాయం లో జరిగాయన్నారు. గుళ్లు కట్టామని చెపుతున్న జీవన్ రెడ్డి అంకూల్ కు కొండగట్టు కోనేరు, ధర్మపురి గోదావరి ఎందుకు కనిపించలేదో చెప్పాలని ప్రశ్నించారు. కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి 4 వేల కోట్లు తీసువెళ్లారని, ఇప్పటికైనా ఫండ్స్ తీసుకురావాలని సూచించారు.  గతం లో వైఎస్ రాజశేకర్ రెడ్డి హాయం లో ఎమ్మెల్యే ఓడిన జీవన్ రెడ్డికి మినిస్టర్ పదవి వచ్చిందని, ఇప్పుడు ప్రజలు జీవన్ రెడ్డిని ఓడకొట్టినా మినిస్టర్ పదవి దక్కుతుందని జోస్యం చెప్పారు. ఆరవింద్ అన్నను గెలిపు తో కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేంద్ర మినిస్టర్ల తో జగిత్యాలను అభివృద్ది చేసుకుందమన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు రంగు గోపాల్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనుమల్ల కృష్ణహరి,జగిత్యాల రురల్ మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి,పట్టణ ప్రధానకార్యదర్శి ఆముద రాజు,జిల్లా కోశాధికారి సుంకేట దశరథ్ రెడ్డి,సింగం పద్మ,కాసేటి తిరుపతి, వంశీ,ప్రశాంత్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్