Monday, March 16, 2026

 ప్రతిపక్ష పార్టీ అయ్యేలా కవిత వ్యూహమా?

- Advertisement -

 ప్రతిపక్ష పార్లీ అయ్యేలా కవిత వ్యూహమా?

Is Kavitha’s strategy aimed at forming an opposition party?

హైదరాబాద్, మార్చి 16, (వాయిస్ టుడే )
ఐయామ్ వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్. ప్రజల గొంతుగా నిలబడతా. ఎప్పుడో ఓసారి తెలంగాణకు ముఖ్యమంత్రిని అయి తీరుతా. జాగృతి అధ్యక్షురాలు కవిత స్టేట్‌మెంట్స్ ఇవి. బీఆర్ఎస్‌ను వీడినప్పటి నుంచి ప్రత్యేక రాజకీయ ఎజెండాతో ముందుకెళ్తున్న కవిత.. ఓవైపు పార్టీ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తూనే..అసలు సిసలు ప్లాన్‌ను ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు. పరిస్థితులను బట్టి..పొలిటికల్ ఈక్వేషన్స్‌ బేరీజు వేసుకుని..ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు. వరుస కార్యక్రమాలు, మెరుపు ధర్నాలు, దీక్షలతో అధికార కాంగ్రెస్‌ తీరుపై నిరసన తెలుపుతూనే..ఇటు బీఆర్ఎస్, బీజేపీపై విమర్శల దాడిని కంటిన్యూ చేస్తున్నారు. ఓ రకంగా తానే అసలైన ప్రతిపక్షం అన్న లెవల్‌కు ఎదిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారట కల్వకుంట్ల కవిత.త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు కవిత. అంతలోపే అంశాల వారీగా తనదైన శైలితో పోరాటం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై ఫైట్ చేస్తూ వస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి అంశంపై రియాక్ట్ అవుతున్నారు కవిత. హైదరాబాద్ నుంచి మొదలు రాష్ట్రంలో ఎక్కడ ప్రజల సమస్యలు ఉంటే అక్కడికి వెళ్తున్నారామె. అంశాన్ని బట్టి నిరసనలు, ధర్నాలు చేస్తూ..వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సమస్య తీవ్రతను బట్టి మెరుపు దీక్షలు, చివరికి ఆమరణ నిరాహార దీక్షకు కూడా దీగడంతో కవిత రాజకీయ వ్యూహంపై అసక్తికరమైన చర్చ మొదలైంది.జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కవిత..ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు. నిరుద్యోగుల కోసం ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేశారు కవిత. హైదరాబాద్‌లో మూసీ పక్కన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమంగా నిర్మాణాలు చేస్తోందని మెరుపు ధర్నాతో నిరసన తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మహిళలకు 2,500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా భవన్ ముందు ధర్నా నిర్వహించారు కవిత. జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి రైతుల సమస్యలపై కలెక్టరేట్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. రైతు సంఘర్షణ సభ తర్వాత కలెక్టరేట్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడే బైఠాయించి నిరసన తెలిపి, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.లేటెస్ట్‌గా ఖమ్మం వెలుగుమట్ల బాధితుల తరపున కవిత ఏకంగా నిరాహార దీక్ష చేయడం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. వెలుగుమట్ల బాధితుల ఇళ్లు కూల్చడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన కవిత..మళ్లీ అక్కడే వాళ్లకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఖమ్మంలో దీక్ష చేస్తున్న కవితను పోలీసులు హైదరాబాద్ తరలించినా..దీక్షను కొనసాగించారు. చివరికి ప్రభుత్వం వెలుగుమట్ల బాదితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో మూడు రోజుల నిరాహార దీక్షను విరమించారు కవిత. ఇలా వరుసగా ప్రజా సమస్యలపై నిరసనలు, పోరాటాలు, దీక్షలు చేయడం వెనుక ఆమె రాజకీయ వ్యూహం ఏమై ఉంటుందన్న చర్చ మొదలైంది. అంత ఆశామాషీగా కవిత ఇదంతా చేయడం లేదని, ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు.వచ్చే నెలలో రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న కవిత..అంతకుముందే తనను తాను ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, జనం పక్షాన నిలుస్తున్నాననే ఇండికేషన్‌ ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష, విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలను వెనక్కినెట్టి తాను అపోజిషన్‌ రోల్ ప్లే చేయాలని కవిత స్కెచ్‌ వేస్తున్నట్లు చెబుతున్నారు. నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేయడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీల కంటే ఎక్కువగా తాను జనంలో ఉంటూ పబ్లిక్‌ వాయిస్‌గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తానే అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నట్లు చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారట కవిత. రాజకీయ పార్టీ పెట్టాక మరింత దూకుడు పెంచి బీఆర్ఎస్, బీజేపీకి ఆల్టర్‌నేట్‌ అయ్యేలా వ్యూహం అమలు చేస్తున్నారట. తెలంగాణ పొలిటికల్ సినారియోలో కవిత ప్లాన్ లు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్