Saturday, February 15, 2025

కేసీఆర్ వైల్డ్ ఫైరేనా…

- Advertisement -

కేసీఆర్ వైల్డ్ ఫైరేనా…

Is KCR wild fire...

మెదక్, ఫిబ్రవరి 3, (వాయిస్ టుడే)
తెలంగాణ గట్టుపై సరికొత్త రాజకీయం. రోజుకో హాట్ టాపిక్. ఎన్నో పొలిటికల్ ఇష్యూస్. డెవలప్‌మెంట్‌ ఏదైనా రాజకీయమంతా ఆయన చుట్టే. విమర్శ అయినా..పొగడ్తా అయినా..ఆయన మౌనంగా ఉన్నా..మాట్లాడినా..అన్నింటా గులాబీ దళపతి ప్రస్తావన ఉండాల్సిందే. సీఎం రేవంత్‌ సవాల్ చేసినా..మంత్రులు రెచ్చిగొట్టినా సైలెంట్‌గా ఉంటూ.. ఇటు బీఆర్ఎస్‌ పార్టీలో అటు ప్రజల్లో..పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఆసక్తిరేపుతూ వచ్చిన కేసీఆర్ ఎట్టకేలకు మౌనం వీడారు.ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేసీఆర్‌ సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌ పాలనపై నిప్పులు చెరిగిన గులాబీ బాస్..గంభీరంగా అన్నీ గమనిస్తున్నానని చెప్పారు. తాను కొడితే మాములుగా ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్‌ వాళ్లకు చూపించి మెడలు వంచుతామన్నారు. ఏడాది కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరన్న కేసీఆర్..కాంగ్రెస్‌ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు.తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని చెప్పారు. భూముల ధరలు అమాంతం పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన గులాబీ బాస్.. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలంటూ గులాబీ క్యాడర్‌కు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ పెడుతున్నామని.. అందరూ తప్పకుండా రావాలన్నారు కేసీఆర్.కాంగ్రెస్‌పై అంతటా అసంతృప్తే ఉందన్న ఆయన.. రైతుబంధుకి రాంరాం, దళితబంధుకు జైభీం చెబుతారని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. మంచేదో చెడేదో ప్రజలకు తెలిసి వచ్చిందని..కైలాసం ఆడితే పాము మింగినట్లు అయిందని..కాంగ్రెస్ పాలనను ఉదహరించారు కేసీఆర్. మాట్లాడితే ఫామ్‌ హౌస్‌..ఫామ్‌ హౌస్‌ అని బద్నాం చేస్తున్నారని..ఫామ్‌ హౌస్‌లో పంటలే ఉంటాయని చెప్పుకొచ్చారు గులాబీ బాస్.గులాబీ దళపతి మౌనం వీడటం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నాలుగు ప్రభుత్వ పథకాలు అమలుపై కన్ఫ్యూజన్..రైతు బంధు ఆలస్యంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్న వేళ కేసీఆర్ సమరమే అంటూ ప్రకటించడం గులాబీ క్యాడర్‌లో జోష్‌ నింపుతోంది. అయితే ముందస్తు వ్యూహం ప్రకారమే ఫిబ్రవరి నుంచి ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారట కేసీఆర్.సంక్రాంతి పీడ దినాలు అయిపోయాక జనవరి 15 తర్వాత ఫీల్డ్‌లోకి దిగాలని భావించారు కేసీఆర్. ఇంకాస్త టైమ్‌ ఇచ్చి ఇప్పుడు ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడతామంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని భావించే కేసీఆర్..ఇప్పటివరకు ఆగారని..ఇక ఫుల్‌ టైమ్‌ పబ్లిక్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ వైఫల్యాల మీద సమరభేరి పూరిస్తామంటున్నారు. భారీ పబ్లిక్‌ మీటింగ్ పెట్టి రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్స్‌ను ఎండగడతామని..ఇక జనంలోనే ఉంటామని చెప్పుకొస్తున్నారు.కేటీఆర్‌, హరీశ్‌రావు.. ప్రభుత్వంపై పోరాడుతూ ఫుల్‌ యాక్టివ్‌గానే ఉన్నప్పటికీ, కేసీఆర్‌ మీడియాలో కనిపించని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని..అటు ప్రజలు, ఇటు రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మౌనం వీడటం ఆసక్తిని రేపుతోంది. ఈ మధ్యే కాంగ్రెస్‌ సర్కార్‌ ఏడాది పాలన..సీఎం రేవంత్‌పై పబ్లిక్‌ ఒపీనియన్‌ ఏంటో తెలుసుకునేందుకు కేసీఆర్ ఓ సర్వే చేయించినట్లు వార్తలు వచ్చాయి.కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో 10శాతం ఓట్లు తగ్గాయని కేసీఆర్‌ చేయించిన సర్వేలో తేలిందట. ఆ సర్వే రిపోర్టుకు తగ్గట్లుగానే ప్రస్తుత పరిస్థితులు కూడా ఉన్నాయని..తాను పొలిటికల్ పిచ్‌లోకి దిగడానికి ఇదే సరైన టైమ్‌ అని భావిస్తున్నారట గులాబీ బాస్.ఇప్పటికే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తోంది బీఆర్ఎస్. రైతు ధర్నాల్లో కేటీఆర్..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఏడాది పాలన అయిపోవడంతో..ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ భారీ సభ పెట్టబోతున్నారట. ప్రత్యేకంగా పాటలు కూడా సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక బృందం పాటల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు..వాటి అమలు, ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యమ సమయంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సాంస్కృతిక బృందాలతో ప్రత్యేకంగా వీడియోలు రూపొందించే పనిలో గులాబీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి ప్రభుత్వం ఏయే రంగాల్లో విఫలమైందో వివరించే ప్రయత్నం చేస్తున్నారట.బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ రంగం ఎలా ఉండే..ఇప్పుడెలా ఉంది? ఐటీ పరిస్థితి ఏంటి? ప్రభుత్వ పథకాల అమలు ఎలా ఉంది? రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లో ప్రభుత్వ వైఫల్యాలు ఎలా ఉన్నాయి.. ఇలా అన్ని అంశాలు ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయబోతున్నారట. అందుకోసం ఇప్పటికే అంతా సిద్ధం చేసి పెట్టినట్లు సమాచారం.ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభతో కేసీఆర్ ప్రజల ముందుకు వచ్చి..ఆ తర్వాత జిల్లాల పర్యటనలు వెళ్లే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. సరైన టైమ్‌ చూసి ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తాలని కేసీఆర్ భావిస్తున్నారని..ఇప్పుడు జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని దాన్ని క్యాచ్ చేసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. చూడాలి మరి గులాబీ బాస్‌ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్