Wednesday, April 2, 2025

వైసీపీ నేతలకు సన్ స్ట్రోక్స్ తప్పవా….

- Advertisement -

వైసీపీ నేతలకు సన్ స్ట్రోక్స్ తప్పవా….

Is sun strokes for YCP leaders?

అమరావతి, అక్టోబరు 23, (వాయిస్ టుడే)
ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ పొలిటీషియన్లకు వరుసగా సన్‌స్ట్రోక్‌లు తగులుతున్నాయి. కొడుకులను వమ రాజకీయ వారసుల్ని చేద్దామంటున్న లీడర్లకు వారి కారణంగా అసలు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో కొందరు వైసీపీ నేతలు వారసుల్ని ఎన్నికల బరిలో దింపి చేతులు కాల్చుకున్నారు. ఆ పుత్రరత్నాల నిర్వాకాల కారణంగా ఆ కుటుంబ రాజకీయ భవిష్యత్తే అగమ్యగోచరంగా మారుతుందంటున్నారు. ఏపీలో గత ఎన్నికల్లో పలువురు వైసీపీ నేతలకు సన్‌ స్ట్రోక్‌ గట్టిగానే తగలింది. ఎన్నికల తర్వాత కూడా సదరు పుత్ర రత్నాల నిర్వాకాలతో ఇంకొందరు సీనియర్ నేతల పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, పాల్పడిన అక్రమాలకు సంబంధించి ఇప్పుడు విచారణలు ఎదుర్కొంటున్నారు. తండ్రుల అండ చూసుకుని గత అయిదేళ్లలో చెలరేగిపోయిన వారసులుగా వచ్చిన తనయులను కూడా వెంటాడుతున్న కేసులు.. తమ రాజకీయ భవిష్యత్‌ను కుమారులు ముందుకు తీసుకువెళ్తారని అనుకుంటున్న తరుణంలో వారు కేసుల్లో ఇరుక్కుంటూ ఉండటంతో సదరు సీనియర్ నేతల్లో పొలిటికల్ ఫ్యూచర్‌పై బెంగ కనిపిస్తుంది.ఓ వైపు కేసులు, మరోవైపు రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనలతో నేతలు తల్లడిల్లిపోవాల్సి వస్తుందట. పార్టీకి కూడా వారసుల వ్యవహారం తలనొప్పిగా మారుతుందంట. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ వారసుడు వైసీపీ నేత శ్రీకాంత్ తాజాగా మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చారు.మరోవైపు తన కొడుకు శ్రీకాంత్ అరెస్టును మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రోద్బలంతోనే పోలీసులు తన కొడుకును అరెస్ట్ చేశారని ఆరోపించారు. తమ రాజకీయ జీవితాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతోనే సుభాష్.. తన కొడుకుని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఆయన ఆరోపణల సంగతేమో కాని 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న విశ్వరూప్ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. కాంగ్రెస్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైసీపీలోకి వచ్చిన ఆయన వైఎస్ నుంచి జగన్ వరకు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు.ఇక పొలిటికల్ రిటైర్ మెంట్ తీసుకుందామని భావించి మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడు శ్రీకాంత్‌ను అమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూశారు. అయితే జగన్ ఒప్పుకోకపోవడంతో తానే మరోసారి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకుని రాజకీయ అరంగేట్రం చేయించాలని భావిస్తున్న విశ్వరూప్‌కు వైద్యుడైన శ్రీకాంత్ దళిత యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఇరుక్కుని కోలుకోలేని షాక్ ఇచ్చారు.మరో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్‌ పరిస్థితి అలాగే తయారైంది. 2009లో కాంగ్రెస్ నుంచి పెడన ఎమ్మెల్యేగా మొదటి సారి గెలిచిన జోగి రమేష్ 2014లో మైలవరం షిఫ్ట్ అయి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తిరిగి పెడన నుంచి గెలిచిన ఆయనకు జగన్ మంత్రి పదవి కూడా కట్ట బెట్టారు. ఇక మొన్నటి ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి దారుణ పరాజయం మూట గట్టుకున్నారు. పాపం ఆయన కూడా వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి కొడుకు రాజీవ్‌కు బాధ్యతలు అప్పగించాలని భావించారంటఅయితే అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేశ్ చేసిన అక్రమాలు జోగి రాజీవ్‌ని వెంటాడం మొదలుపెట్టాయి . విజయవాడకు చెందిన అగ్రిగోల్డ్ సంస్థ భూములు సీఐడీ అటాచ్‌మెంట్లో ఉన్నాయి . ఇలా అటాచ్ చేసిన భూములను నిబంధనలకు విరుద్ధంగా జోగి రమేశ్ కుటుంబం సొంతం చేసుకుంది అనేది ఆరోపణ. ఆ భూములు రాజీవ్ పేరిట రిజిస్టర్ అయిఉండటంతో సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడి కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కుట్ర పన్నిన జోగు రమేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ పోలీసలు విచారణలు ఎదుర్కొంటూ.. బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించి ఉన్నారు. మరి ఆ తండ్రి కొడుకుల పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.మరో మాజీ మంత్రి పేర్ని నానికి కూడా సన్‌ స్ట్రోక్ తగులుతూనే ఉంది. పేర్నా నాని గత ఎన్నికల్లో తాను మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ నుంచి తప్పుకుని తనయుడు పేర్ని కిట్టూని బరిలోకి దింపారు . అయితే 2019లో తన తండ్రి 4 వేల ఓట్ల తేడాతో గెలిచిన చోట పేర్ని కిట్టూ ఏకంగా 50 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలై తండ్రికి షాక్ ఇచ్చారు. ఎన్నికల టైంలోనే పేర్ని వారసుడిపై పోలీసుల విధులకు అటంకం కలిగించారని కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన గుడ్లవల్లేరు కాలేజీ వ్యవహారంలో కిట్టుపై ఆరోపణలు వచ్చాయి. కాలేజీలో హిడెన్ కెమెరాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసింది కిట్టునే అన్న ప్రచారం ఉంది. దానిపై విచారణ పూర్తైతే కిట్టూ బుక్ అవ్వడం ఖాయమంటున్నారు.చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిలు కూడా వారసుల కోసం గత ఎన్నికల్లో త్యాగాలు చేశారు.. తాము పోటీ నుంచి తప్పుకుని కొడుకులకు టికెట్లు ఇప్పించుకున్నారు. అయితే ఆ వారసులిద్దరు తొలి అటెంప్ట్‌లో సక్సెస్ కాలేక పోయారు. ఇక ఆ రెండు నియోజకవర్గాల్లో దొంగ ఓట్ల నమోదుకు సంబంధించి ఆరోపణలున్నాయి . దానిపై జరుగుతున్న విచారణలో నిజాలు నిగ్గు తేలితే వారసులతో పాటు తండ్రులు కూడా కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి కనిపిస్తుంది.. మరోవైపు చెవిరెడి కుమారుడు మోహిత్‌రెడ్డి ఇప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడుగా ఉన్నాడు. అటు భూమన కూడా టీటీడీలో అక్రమాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ క్రమంలో చెవిరెడ్డి ,భూమన ఫ్యామిలీల పొలిటికల్ ఫ్యూచర్ చర్చల్లో నలుగుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్