Sunday, September 8, 2024

ఆ నేతల సైలెంట్ వెనుక అసలు రహస్యం అదేనా..?

- Advertisement -

నేతలంతా గప్చిప్.. ఏం జరగనుందో?
ఆ నేతల సైలెంట్ వెనుక అసలు రహస్యం అదేనా..?
అమరావతి జూలై 16
వైసీపీ అధికారంలో ఉన్న ఐవేళ్లూ.. కొందరు నేతల నోళ్లకు ఐదూ విశ్రాంతి లేకుండా పోయింది. ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తూ అప్పటి విపక్ష నేతలపై నిత్యం అభ్యంతరకర పదాలతో విరుచుకుపడేవారు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం.. ఓ పార్టీ విమర్శలకు మరో పార్టీ కౌంటర్ ఇవ్వడం దేశ వ్యాప్తంగా చూస్తుంటాం. కానీ ఏపీలో మాత్రం 2019 నుంచి 2024 మధ్య వైసీపీ నేతలు రాజకీయ విమర్శలను పక్కనపెట్టి.. విపక్ష నేతలను వ్యక్తిగతంగా ఆంధ్ర టార్గెట్ చేస్తూ.. తిట్లతో విరుచుకుపడేవారు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రజలు కోరుకుంటున్నది తిట్లవినిపించని బడా నేతల స్వరం..పురాణం కాదని.. అభివృద్ధి, సంక్షేమమని వైసీపీ నేతలకు తెలిసాచ్చేలా ప్రజలు ఎన్నికల్లో తీర్పునిచ్చారు. తమకు నచ్చని వ్యక్తులను, నాయకులను లక్ష్యంగా చేసుకుని తిట్టడానికి మిమల్ని చట్టసభలకు పంపలేదని.. ప్రజల భవిష్యత్తును బాగుచేయడానికి పంపితే.. మీరు సర్వనాశనం చేశారని తెలిసేలా ఏపీ ఓటర్లు తీర్పు చెప్పారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. తాము భారీ మెజార్టీతో గెలుస్తామని విర్రవీగిన నేతలు పరాజయం పాలయ్యారు. విపక్షాలపై తిట్లతో విరుచుకుపడ్డ నాయకులను ప్రజలు ఎన్నికల్లో ఓడించారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు పనిచేసినట్లు భవిష్యత్తులో ఎవరూ పనిచేయవద్దని.. ఆచితూచి వ్యవహరించాలని ఓ సందేశాన్నిచ్చారు ఏపీ ప్రజలు. విపీలో ఎన్నికల తర్వాత వైసీపీలో కొందరు నేతలు సైలెంట్ అయిపోయారట, ప్రధానంగా మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజిని, కొడాలి నాని, గుడివాడ అమర్ నాధ్, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల ముందునిత్యం విూడియాలో కనిపిస్తూ.. చంద్రబాబు, జగన్ సహా ఆపార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు. అవతలి నుంచి ప్రభుత్వ పనివిధానంపై ఏదైనా అభ్యంతరం తెలియజేస్తే.. విషయంపై మాట్లాడకుండా.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నంచేవారు. ఎన్నికల తర్వాత ఆ నాయకుల స్వరం వినిపించడం లేదు. ఐదేళ్లపాటు ప్రతిరోజూ ముందుకువచ్చి రోజుల కాలంలో పెద్దగా మీడియాలో కనిపించడం లేదు. క్రమంగా బలహీనవడుతుండటంతో.. నోరు మెదిపితే తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే ఆలోచనతోనే కొందరు వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు తమను ఎమ్మెల్యేలుగా తిరస్కరం చదంతోనే నాయకులంతా సైలెంట్ అయిపోయారనే ప్రచారం సైతం జరుగుతోంది. కొందరు వేతలు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట… మరికొందరైతే మాట్లాడేవ్యక్తులు గత నెలపూర్తిగా వైసీపీ హైకమాందకు టర్లోనే లేరట, నియోజకవర్గంలో కనిపించని నేతల్లో కొందరు హైదరాబాద్కు జంప్ అయితే.. మరికొందరు చెన్నైకు వెళ్లిపోయారట. ఇంకొందరు విదేశాలకు పారిపోయారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నాయకుల స్వరం తగ్గడానికి కారణాలు ఏమిటి.. ఆ పార్టీ వ్యహం పనిచేస్తుందా అనేది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్