- Advertisement -
నల్లారికి లైన్ క్లియరేనా
Is the line clear for Nallari?
తిరుపతి, ఫిబ్రవరి 7, (వాయిస్ టుడే)
వైసీపీ రాజ్యసభ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. దీంతో త్వరలో రాజ్యసభకు ఎన్నిక జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవ్వడానికి సిద్ధమవుతుంది. కానీ టీడీపీ నేతలు కూడా ఈ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. 2028 జూన్ 21 వరకూ పదవీ కాలం ఉండటంతో దీనిపై నేతలు ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు వద్దకు పైరవీల కోసం వస్తున్నారు. అయితే ఇది ఇప్పటికే బీజేపీకి ఫిక్స్ అయిందన్న ప్రచారంతో నేతలు డీలా చేస్తున్నారు. త్వరలోనే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని చెబుతున్నారు. అయితే ఈరోజు జగన్ మీడియా సమావేశంలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారురాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంపై ఆయన స్పందిస్తూ మరికొందరు కూడా వెళ్లే అవకాశముందని అంటున్నారని అనడంతో ఇంకా ఉన్నారా? అన్న అనుమానం బయలుదేరింది. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పోస్టు మాత్రం బీజేపీ నేతలు తమకు కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఆ పార్టీ ఎవరిని నిలబెడుతుందన్నది ఇంతవరకూ బయటకు రాలేదు. మెగాస్టార్ చిరంజీవి అని, మాజీ ముఖ్యమంత్రినల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని పలు రకాలుగా ప్రచారం జరుగుతుంది. అయితే వీరిద్దరూ కాకుండా కొత్త వారికి పార్టీని నమ్ముకుని సుదీర్ఘకాలం నుంచి ఉన్నవారికి ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీ అగ్రనాయకత్వం ఎవరి పేరు ఖరారు చేసినా కూటమి ప్రభుత్వం దానిని కాదనే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తుతం అవసరం ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేనలు బీజేపీ అభిప్రాయానికి తలవంచే పరిస్థితులు ఉన్నాయి. అసలు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడానికి తామే కారణమని, అందుకే తమకే ఈ స్థానం కావాలని ఇప్పటికే కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు స్పష్టం చేసింది. అయినా టీడీపీ నుంచి ఆశావహులు మాత్రం పెద్దయెత్తున పోటీ పడుతున్నారు. ఎక్కువ సమయం పదవీకాలం ఉండటంతో దేవినేని ఉమ లాంటి వాళ్లు కూడా తమ పేరును పరిశీలించాలని అధినాయకత్వాన్నికోరినట్లు తెలిసింది. అయితే ఈ పోస్టు ఎవరికి వెళుతుంది? ఎవరిని చివరకు ఎంపిక చేస్తారు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే కనిపిస్తున్నా, బీజేపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
- Advertisement -