- Advertisement -
సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు!
Is this the creation of wealth? Chandrababu!
అబద్దాల హామీతో గద్దెనెక్కిన కూటమి
ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
– లాంతర్లు.. నెత్తిన విద్యుత్ బలుపులు పెట్టుకుని వినూత్న నిరసన
– పెంచిన విద్యుత్ చార్జీలపై “దక్షిణ వైఎస్ఆర్సిపి ” పోరుబాట
విశాఖపట్నం
ఇచ్చిన ఉచిత హామీలు గాలికి వదిలి.. ప్రజల నెత్తిన వేల కోట్ల భారం మోపడమేనా సంపద సృష్టి అంటే అని చంద్రబాబుపై దక్షిణ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు శుక్రవారం పలు నియోజకవర్గాలలో చేపడుతున్న విద్యుత్తుపై పోరుబాటలో భాగంగా దక్షిణ నియోజకవర్గం లోని జగదాంబ జంక్షన్ నుండి ఈపీడీసీఎల్ విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా వైయస్సార్ విగ్రహానికి వాసుపల్లి గణేష్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముందుగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిని చింతిస్తూ అంజలి ఘటించారు. అనంతరం పోరుబాటలో భాగంగా దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి లాంతర్లు పట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాల హామీలతో సామాన్య బతుకులు మళ్ళీ చీకటిలోకి నెట్టబడ్డాయన్నారు. భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలలో గెలిచేందుకు ఎన్నో ఉచిత హామీలు చేశారని, వాటిని అమలు చేయడంలో విఫలం అవ్వడమే కాకుండా ప్రజలపై అనేక రకాల పన్నులభారం మోపరని, అలాగే విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని వాసుపల్లి ధ్వజమెత్తారు. గృహ వినియోగదారులపై 15,485.36 కోట్ల చార్జీల బాదుడు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు కొనసాగించాలన్నారు. అవసరమైతే చార్జీలు తగ్గిస్తామని బూటకపు మాటలు చెప్పిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. విద్యుత్తు చార్జీల పెంపుకు వ్యతిరేకిస్తూ 2000 సంవత్సరంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టిన రైతులపై కాల్పులు జరిపిన ఘనుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. ఆరు నెలలు తిరగకుండానే జనం జేబులకు చిల్లులు పడేలా కరెంటు చాట్ చేయల వాత పెట్టాడని దుయ్యబట్టారు. నవంబర్లో రూ.6072.86 కోట్లు, డిసెంబర్లో రూ.9412.50 కోట్లు కలిసి మొత్తంగా రూ.15,485.36 కోట్లు ప్రజలపై భారం మోపారని వాసుపల్లి అన్నారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారన్నారు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా తిరిగి వారి నుండే వసూళ్లు చేయడం హేయమైన చర్య అన్నారు. డిస్కం లను అప్పుల్లోకి నెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. 2014 నాటికి రూ. 29 వేల కోట్లు అప్పులు బకాయిలు ఉంటే 2019 చంద్రబాబు దిగే నాటికి అభి 86 వేల కోట్లు చేరాయి అన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను ముంచడానికి కొత్త కొత్త పద్ధతులు చంద్రబాబు కనిపెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు తిరిగి అందేలా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేంతవరకు వైయస్సార్ పార్టీ తరఫున పోరాటం ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ జాన్ వెస్లీ , మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండా రాజీవ్, మూగి శ్రీను, కార్పొరేటర్లు కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ & కోడిగుడ్ల శ్రీధర్, తోట పద్మావతి, చెన్న జానకి రామ్, బిపిన్ జైన్
కో ఆప్షన్ నెంబర్ సలీం, వార్డ్ ప్రెసిడెంట్లు: నీలపు సర్వేశ్వర్ రెడ్డి, పీతల వాసు, దశమంతుల మాణిక్యాలరావు & చిన్ని , బాపు ఆనంద్, ముత్తాబత్తుల రమేష్, కనకరెడ్డి, మసిపోగురాజు, నొల్లు పోతుస్వామి, మైకల్ రాజు, బీశెట్టి ప్రసాద్,సౌత్ ముస్లిం ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్,మాజీ డైరెక్టర్లు సకల భక్తుల ప్రసాద్, సనపల రవీందర భరత్, డేవిడ్ రాజు, అమ్మాజీ, కనకల ఈశ్వర్, బడుకుంది నాగమణి,అనురాధ,పాల శ్రీహరిరెడ్డి, గుడి చైర్మన్లు లండ రమణ, లింగం శ్రీను, వడ్డాది దిలీప్, ఆనంద, మల్లిబాబు,దశమంతుల రామలక్ష్మి,అభిరెడ్డి అది విష్ణు, బోర శ్రీనివాస రెడ్డి, పాత్రపల్లి రాము, వాసర్ల సుబ్రహ్మణ్యం (బుజ్జి), కోన శంకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -