మార్పు అంటే ఇదేనా?
Is this what change means..?ఎవరిని ఉద్దరించారని విజయోత్సవాలు
కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీస్తున్నారు.
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్..
జగిత్యాల
ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన కళ్లిబొల్లి మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలం వెళ్ళదీస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి విజయోత్సవాలు అంటూ ప్రయత్నిస్తోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు.నేడు పెగడపెల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలిచ్చి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అంటూ ఏడాదిలో చేసిన మార్పు టిఎస్ ను టిజీ గా, నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా, ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా, గతంలో రూపొందిందించిన తెలంగాణా తల్లి విగ్రహం కల్వకుంట్ల కవితను పోలి ఉందని అట్టిదానిని సోనియాగాంధీ రూపంలో మార్చి చేతిలో బతుకమ్మ నెత్తిన కిరీటం తీసేసి చేతి గుర్తుకు ఓటయ్యండి అనే పద్దతిలో విగ్రహాన్ని రూపొందించి కాకతీయుల కాలంలో రెడ్లకు వ్యతిరేకంగా ప్రతాపరుద్రుడు పోరాడాడని కాకతీయ కళాతోరణంతో కూడిన రాజముద్రను మార్చారే తప్ప ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 9 డిసెంబర్ 2023 తారీకు సోనియా జన్మదినం సందర్బంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 100 రోజులు అంటూ దాటవేసి ఇప్పుడు కోర్రీలు పెడుతున్నారని అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం ధరణి పోర్టల్ రద్దు అని చెప్పి ఇంతవరకు రైతుబందు వేయకుండా రెండు లక్షలు రుణమాఫీ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు .ఇప్పటివరకు తెలంగాణాలో వందలాది మంది రైతులు చనిపోతే ఒక్కరికి కూడా రైతు బీమా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ తరుగు లేకుండా కొనుగోలు చేయడం క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నాలకు మాత్రమే అంటూ తెలంగాణా రైతులను మోసం చేసిందని అన్నారు.రెండవ విడత ఆర్వోఆరు సాదాభైనామాలు 12 లక్షల దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పట్టించుకోవడం లేదన్నారు.మహిళలకు తులం బంగారం నెలకు 2500 రూపాయలు పెన్షన్ల పెంపు ఉపాధి కూలీలకు సంవత్సరానికి 12,000.ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 నియోజకవర్గానికి 4000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అన్ని రంగాలలో వైఫల్యం చెందినందుకా విజయోత్సవాలు అంటూ ప్రజాధనం దుర్వినియోగం చేసి పార్టీ ప్రచారం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగ పడుతాయని వీటివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలే బిజెపి విజయానికి నాంది పలుకనున్నాయని అన్నారు.




