న్యూఢిల్లీ: హమాస్ ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయేల్ భద్రతా దళాలు ముప్పేట దాడికి దిగాయి. గాజాను నేలమట్టం చేసేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు. గాజాపై భూ దాడికి ఇజ్రాయెల్ సిద్దయియంది. 11 లక్షల మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ డెడ్లైన్ విధించింది. 24 గంటల్లో దక్షిణ దిశకు వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే గాజాకు నిత్యావసరాల సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, ఇజ్రాయెల్ చర్యలను ఐక్యరాజ్యసమితి ఖండించింది. తమ బందీలను వదిలిపెడితేనే గాజాకు.. ఆహారం, నీరు అనుమతిస్తామని ఇజ్రాయెల్ అంటోంది. యుద్ధం మరింత తీవ్రమవుతుందని ఇజ్రాయెల్కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. గాజా స్ట్రిప్కు నిత్యావసరాలు, విద్యుత్ నిలిపివేయడంపై సీరియస్ అయింది. యుద్ధ నేరాలుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. తాము ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుందని సంకేతాలు పంపింది.