ఇస్రో చైర్మన్  చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు

- Advertisement -

ఉమ్మడి నెల్లూరు జిల్లా లోని సూళ్లూరుపేట లో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని ఇస్రో చైర్మన్ సోమనాధ్ శుక్రవారం దర్శించుకుని పూజలు చేశారు, అమ్మణ్ణి ఆశీస్సులతో చంద్రయాన్ -3 విజయవంతం కావడం పట్ల అమ్మణ్ణికి పూజలు చేయడం తో పాటు  ఆదిత్య – L1 మిషన్ ప్రయోగం కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ  ఇస్రో చైర్మన్ సోమనాద్ అమ్మణ్ణికి పూజలు చేయడం జరిగింది, ఆలయం వద్ద ఆయనకు EO ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి స్వాగతం పలికారు, అనంతరం సోమనాధ్ అమ్మణ్ణిని దర్శించి పూజలు చేశారు , ఇస్రో చైర్మన్ కు EO ఆలయ  మర్యాదలు అందజేశారు,  ఈ సందర్భముగా విలేకర్లతో  ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ సూర్యుని పై అధ్యనం చేయడం కోసం  ఉదయం 11 : 50 నిమిషాలకు PSLV – C57 రాకెట్ ద్వారా ఆదిత్య – L1 మిషన్ ను ప్రయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు, ఆదిత్య మిషన్ ప్రయాణం 125 రోజులు ఉంటుందని , సూర్యునికి సమీపం లోకి చేరుకున్నాక అక్కడ జరిగే వాతావరణ మార్పులను , ఉష్ణోగ్రత మార్పుల పై పరిశోధనలు చేయడం జరుగుతుందని తెలిపారు, వచ్చే నెలలో గగన్ యాన్ పరిశోధాత్మక ప్రయోగం ఉంటుందని తెలియజేసారు, చైర్మన్ తో పాటు షార్ డైరెక్టర్ రాజరాజన్ ఆర్ముగం , గ్రూప్  డైరెక్టర్ గోపినాధ్ కూడా ఉన్నారు.

ISRO Chairman Chengalamma worships at Parameshwari Temple
ISRO Chairman Chengalamma worships at Parameshwari Temple
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular