- Advertisement -
శంషాబాద్: తెలంగాణలో జరుగుతున్న ఐటీ రైడ్స్తో బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సోదాలు కొత్తగా ఏం జరగడం లేదని అన్నారు. గతంలోనూ పలు చోట్ల తనిఖీలు చేశారని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈ వ్యాఖ్యలు చేశారు.
- Advertisement -