దాన గుణాన్ని చాటి చెప్పేది బక్రీద్
బద్వేలు
దైవ కోరికతో వెనుకంజ వేయని తండ్రి ఇబ్రహీం ఖల్లీలుల్లా (అలై) అలాగే భర్త పట్ల విధేయత చాటుకున్న భార్య హజీరా (రజి) అలాగే తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రాణ త్యాగానికి సిద్ధపడిన హజ్రల్ ఇస్మాయిల్ జెబివుల్లా (అలై) గారి విధేయత, ప్రపంచము అంతం వరకు, రాబోయే ప్రజలకు తెలపడానికి ప్రతీకగా ఈ యొక్క బక్రీద్ పండుగ ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. రంజాన్ మాంసం తర్వాత దాదాపు రెండు నెలల తర్వాత బక్రీద్ వస్తుంది. ఈ పండగ ముస్లింల రెండో అతి ముఖ్యమైన పండగ.అంతేకాకుండా ఈ పర్వదినం త్యాగాన్ని సూచిస్తుంది. ఈరోజును బక్రా ఈద్, బక్రీద్, ఈద్-అల్ ఆధా, ఈద్ కుర్బాన్ లేదా కార్బన్ బయారామి అని కూడా పిలుస్తారు ఇస్లాంను అనుసరించే వారికి అత్యంత పండుగలో ఒకటై బక్రీద్ లేదా ఈద్ అల్ ఆదాకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండగ సమాజంలోని వ్యక్తుల్లో దాన గుణాన్ని త్యాగ నిరతిని, పెంపొందిస్తుంది. తమ ఇంటితోపాటు పేదలు, దగ్గర బంధువులు, ఇరుగుపొరుగు వారిని కూడా ఈ సంతోషంలో భాగస్వామ్యం చేయాలని ఉద్బోధిస్తుంది. తమకు కలిగిన దానిలో కొంత దానం చేసి, తాము తినే దానిలో కొంత ఇతరులకు పెట్టాలని చెబుతుంది. అందుకే బక్రీద్ వేడుక రోజున త్యాగ నిరతిని చాటుకుంటూ ఇతరులకు తమ వంతు సహకారాలు అందిస్తారు. బక్రీద్ వేడుక రోజున ఆరుబయట ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు అనంతరం మత పెద్దలు ధార్మిక సందేశాలు ఇస్తారు.