పేరుకే పెళ్లి రోజు దావత్ చేసేది మాత్రం బిఆర్ఎస్ ప్రచారం

పేరుకే పెండ్లి రోజు దవత్ ప్రచారం మాత్రం కారు పార్టీ నాయకులది…ఇది మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు యుదేచ్ఛగా చేస్తున్న ఉల్లంఘన. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.కాలనీల్లో పుట్టిన రోజులు, పెండ్లి రోజుల పేరుతో దావత్ లను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఆదివారం నాడు రాత్రి సమయంలో పీర్జాదీగూడ 11 వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి అధ్వర్యంలో ఒక పార్ట్ మెంట్ లో పెండ్లి రోజు వేడుకను ఏర్పాటు చేసి మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రితి రెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డిలతో పాటు బీఆర్ఎస్ నేతలు వచ్చి కారు పార్టీకే ఓటు వెయ్యాలని ప్రచారం నిర్వహించారు. అనంతరం దాదాపు రెండు వందల మందికి మద్యం ఏర్పాటు చేసి విందు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళి కవరేజి చేస్తుండగా మల్లారెడ్డి కోడలు ప్రితి రెడ్డి దౌర్జన్యంగా కెమెరాలు గుంజుకుని పోటోలు,వీడియోలను డిలీట్ చేశారు. అక్కడికి ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ రాధిక టిం చేరుకోని అనుమతులు లేకుండా ఇలాంటి గ్యాదరింగ్ లు నిర్వహించారాదని అనడంతో అమేపైకి దుసుకువచ్చారు.దాదాపు రెండోందల మందికి మద్యం ఏర్పాటు చేస్తే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలని ఇలా చేయడం సరైనది కాదని వార్నింగ్ ఇచ్చారు. అప్పటికే పరిస్థితి గమనించిన స్థానిక కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి గోడ దూకి పారిపోయాడు.విషయం తెలుసుకున్న మేడిపల్లి సీఐ ఘటన స్థలానికి చేరుకుని అందరినీ అక్కడి నుండి పంపించారు. అనంతరం జరిగిన ఘటనపై ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరీ ఇంత బహిరంగంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఎమైన చర్యలు ఉంటాయా లేదా వేచి చూడాలి.



