మోడీని మళ్లీ ప్రధానిని చేయాల్సిన బాధ్యత మనపై వుంది
బండి సంజయ్
అదిలాబాద్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆదిలాబాద్ జిల్లా మున్నూరుకాపు సంఘం భవన నిర్మాణానికి ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.10 లక్షలు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిని గెలిపించిన వెంటనే మరో రూ.50 లక్షల నిధుల సాయం అందిస్తామని హామీ ఇస్తున్నా. అట్లాగే మున్నూరుకాపు సంఘం భవనాన్ని ఆదునీకరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. మున్నూరు కాపుల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని వెల్లడించారు. నరేంద్రమోడీని మళ్లీ ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపై వుంది. మున్నూరుకాపులంతా హిందూ సమాజ సంఘటితం చేయండి. కులాలు, వర్గాల పేరుతో ఓట్లను చీల్చే కుట్రలను చేదించండి. దేశం కోసం, ధర్మం కోసం జరిగే పోరాటంలో కాపులు ముందుండాలని పిలుపునిచ్చారు.
మోడీని మళ్లీ ప్రధానిని చేయాల్సిన బాధ్యత మనపై వుంది
- Advertisement -
- Advertisement -