మన రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మన అందరిదీ..
It is our responsibility to protect our constitution.
ఎన్ ఎస్ యు ఐ జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి…
జమ్మికుంట
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ ఎస్ యు ఐ జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి, హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికిన ఎన్ ఎస్ యు ఐ, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్,
అనంతరం గాంధీ భవన్ లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ సభలో ఎన్ ఎస్ యు ఐ,జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి, మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మన అందరిది అని తెలిపారు. మరియు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేసే ఆలోచనలో ఉందని మరియు ఆ సవరణల వల్లా చాలా మంది నష్టపోతారు అని బీజేపీ ప్రభుత్వ తీరును మండిపడ్డారు.
అలాగే హిందువులకు భగవద్గీత ఎలా ముఖ్యమొ, ముస్లింలకు ఖురాన్, ఎంత ముఖ్యమొ ,క్రైస్తవులకు బైబిల్ ఎంత ముఖ్యమొ,అలాగే మన భారతీయులకు రాజ్యాంగం అంత ముఖ్యం అని తెలిపారు. మరియు కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ,ఎస్టీ,,మైనార్టీ,ల అభ్యున్నతి కోసం చాలా కృషి చేస్తుందని, అందుకే ఈ భారత దేశాన్ని మతతత్వ బీజేపీ ప్రభుత్వం పై తిరుగుబాటు గళం ఎత్తడానికి భారీ ఎత్తున విద్యార్థులు ఎన్ ఎస్ యు ఐ, లో జాయిన్ అవ్వాలని ( జాయిన్ ఎన్ఎస్ యు ఐ లీడ్ ఇండియా)అని పిలుపునిచ్చారు.
అనంతరం గాంధీ భవన్లో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్,తో కలిసి భారత్ జోడో 2.0 స్పోర్ట్స్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరించారు..
ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెటి మహేష్, హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు ఎం.డి జియాఉల్ అలీ, కమలాపుర్ మండల అధ్యక్షుడు కుమార్, నాయకులు అరుణ్, అనిల్, మణి, రాజు తదితరులు పాల్గొన్నారు…