రహస్య ప్రదేశంలో ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

హైదరాబాద్

గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. ఏళ్ల తరబడి సేకరించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసిన ప్రణీత్‌కుమార్‌ అలియాస్‌ ప్రణీత్‌రావుతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్‌ ఆదివారం పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular