Wednesday, March 18, 2026

బీసీల పట్ల కపట ప్రేమ చూపించడం సిగ్గుచేటు * బిజెపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు

- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికల జాప్యం.. సంక్షోభంలోకి గ్రామాలలో పరిపాలన
* రేవంత్ రెడ్డి ప్రభుత్వం  నిర్లక్షం వళ్ళ ఆగిపోయిన రూ.2300 కోట్లు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు
* జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న పారిశుద్ధ్య కార్మికులు
 * ఎన్నికల హామీలతో గాలిమాటలు మాట్లాడి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి
* ఇటలీ కుటుంబాన్ని ప్రాధేయపడతూ..తన కుర్చీని కాపాడుకోవడం కోసం ఢిల్లీ టూర్లు
* టూర్లలో ఉన్న జోష్‌.. ఆరు గ్యారెంటీలు, హామీల అమలులో లేదు
* ఈ రాష్ట్రానికి 10 మంది ముఖ్యమంత్రులున్నరు..
* వారిలో  తాను ఒక్కడినని పడరాని పాట్లు పడుతున్న మహేశ్ కుమార్ గౌడ్
* స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు
* కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయక పొతే తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి
* బీసీల పట్ల కపట ప్రేమ చూపించడం సిగ్గుచేటు
* బిజెపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు డిమాండ్
హైదరాబాద్ ఆగష్టు 4

It is shameful to show hypocritical love towards BCs * BJP Party State General Secretary Dr. Kasam Venkateshwarlu

స్థానిక సంస్థల ఎన్నికల జాప్యం.. గ్రామాలలో పరిపాలన సంక్షోభంలోకి నేట్టివేయబదిందని,రేవంత్ రెడ్డి ప్రభుత్వం  నిర్లక్షం వళ్ళ రూ.2300 కోట్లు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయని జీతాలు లేక పారిశుద్ధ్య

కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని బిజెపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు అన్నారు.సోమవారం  బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఎస్ సి

మోర్చా రాష్ట్ర అద్యక్షులు కొల్లేటి శ్రీధర్, కిసాన్ మోర్చా నేత కొండపల్లి శ్రీదర్ రెడ్డిట్ తో కలిసి మాట్లాడారు.తెలంగాణలో సర్పంచ్‌ల పదవీకాలం 2024 ఫిబ్రవరిలో, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం 2024 జూన్‌లో,

మున్సిపాలిటీల పదవీకాలం 2024 సెప్టెంబర్‌లో ముగిసినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. ఈ ఎన్నికల జాప్యం వల్ల గ్రామాలలో పరిపాలన పూర్తిగా సంక్షోభంలోకి

వెళ్లిపోయింది.ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వస్తున్న రూ.2300 కోట్లు నిధులు తెలంగాణకు ఆగిపోయాయి.  ప్రతి గ్రామానికీ వెళ్లినా పారిశుద్ధ్య కార్మికులు జీతాలు

లేక ఇబ్బందులు పడుతున్న దురవస్థలు కనిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీ నుంచి మొదలు రేవంత్ రెడ్డి వరకు రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మాట్లాడే

నాయకులు స్థానిక సంస్థల విషయంలో మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని ఎందుకు పాటించడంలేదు?ఎన్నికల హామీలతో గాలిమాటలు మాట్లాడి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి, వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారు.

ప్రజలకు మొహం చూపించలేని స్థితికి చేరడంతో… మళ్లీ మళ్లీ ఢిల్లీ టూర్లను మొదలుపెట్టారు.ప్రజలకు లాభం లేని విధంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టూర్ల పేరిట ఖర్చు చేస్తూ, ఇటలీ కుటుంబానికి వంచిన

మెట్టు అవుతున్నారు.ఇటలీ కుటుంబాన్ని ప్రాధేయపడతూ..తన కుర్చీని కాపాడుకోవడం కోసం మాత్రమే ఢిల్లీకి పోతున్నడని ఆరోపించారు. ఇప్పటిదాకా 50 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి… టూరిస్ట్ సీఎం అన్న

పేరుతో ప్రజల్లో నవ్వుల పాలయ్యారు. ఈ టూర్లలో ఉన్న జోష్‌.. ఆరు గ్యారెంటీలు, హామీల అమలులో లేదు.రేవంత్ ఇప్పటికైనా దుబారా ప్రయాణాలు బంద్ పెట్టి పాలనపై దృష్టిపెట్టాలి. ప్రజలకు జవాబుదారీగా

ఉండాలన్నారు. 10 ఏండ్ల అవినీతి, అరాచక, కుటుంబ పాలన పోయింది.. ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే… పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. ఇప్పుడు చేతగాని కాంగ్రెస్ పరిపాలన

కారణంగా వందలరెట్లు ఇబ్బంది పడుతున్నరు. రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ పాలనలో యూరియా బ్లాక్ మార్కెట్ బారిన పడి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ సీఎం సహా మంత్రులు ప్రజల సమస్యలను

పక్కనబెట్టి ఢిల్లీ టూర్లలో మునిగిపోయారు.రేవంత్…! ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఇటలీ కుటుంబం దగ్గర పడిగాపులు కాసి తాకట్టుపెట్టకు. ఇది మంచిది కాదని కాచం  హెచ్చరించారు..తెలంగాణ

హైకోర్టు స్పష్టంగా చెప్పింది.. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలనీ, జూలై 25లోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆ ప్రక్రియను పూర్తిచేయలేదు.స్థానిక సంస్థల్లో బీసీలకు

42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. రాష్ట్ర శాసనసభలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించకుండా.. ఢిల్లీబాట పట్టడంలో ఔచిత్యం ఏంటి?రాజ్యాంగంలోని

243-D(6) ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను నిర్ణయించే పూర్తి అధికారమూ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. అసలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇయ్యలేక కాంగ్రెస్ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు ఢిల్లీ బాట

పట్టింది. ఇదంతా డ్రామా.. పైగా ప్రజల దృష్టి మరల్చేలా బిజెపిపై, బిజెపి నాయకులపై విమర్శలు చేస్తున్నరు. అందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. ఈ రాష్ట్రానికి 10 మంది

ముఖ్యమంత్రులున్నరు.. ఆ ముఖ్యమంత్రుల్లో తాను ఒక్కడినని నిరూపించుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ పడరాని పాట్లు పడుతున్నరు. అవసరం లేని పాదయాత్ర చేస్తూ తిప్పలపడ్తున్నరు.తెలంగాణకు బిజెపి

నాయకులు శకునిలా దాపురించారని మహేశ్ కుమార్ గాడ్ ఆరోపణలు చేశారు. నిజానికి తెలంగాణ అభివృద్ధికి పట్టిన అసలైన రాహువు మాత్రం రేవంత్ రెడ్డే. రెవంత్ రెడ్డి ఒక శని లాగా తెలంగాణకు పట్టుకున్నడు.

ఆయన సీఎం అయిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా అభద్రత ముసురు కమ్మింది, అభివృద్ధి దారితప్పింది.నిధుల కొరత, పరిపాలనలో అయోమయం, కలుషిత రాజకీయాలు పెరిగాయి. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులకు

భూములు కేటాయించకుండా అభివృద్ధిని ఆటంకపరిచారు. ప్రజల్లో తిరిగేందుకు ధైర్యం లేక ప్రతిపక్ష నాయకులపై తిట్లు, విమర్శలతోనే కాలం వెల్లదీస్తున్న దరిద్రపు పాలన కాంగ్రెస్ పార్టీది. ఇవన్నీ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి

పట్టిన రాహు గ్రహణ ప్రభావమే.రాముడు బీజేపీకి ఏమైనా సొంతమా? అని మహేశ్ కుమార్ గౌడ్ అడుగుతున్నారు… తెలుసుకోండి… అవును! బిజెపి రాముడికీ సంబంధం ఉంది. భారతదేశానికీ రాముడికీ, జాతీయతకూ

రాముడికీ సంబందం ఉంది. బిజెపి డీఎన్ఏ, భారతదేశ డీఎన్ఏ – రెండింటిలోనూ శ్రీరామచంద్రుడే ప్రతిబింబంగా నిలుస్తారు.అయితే… కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ ఏమిటి? ఇటలీ డీఎన్ఏనా? లేక రావణాసురుడి డీఎన్ఏ

కావొచ్చేమో… ఓసారి పరీక్షించుకోవాలి.కాంగ్రెస్ వారసత్వం రావణాసురునిదైతే, దాన్ని పాటించండి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నడిపిస్తున్నది రాక్షస పాలన కాదా? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అసమర్థ,

నిరంకుశ పాలనను చూసి ‘అయ్యో రామా!’ ఏడుస్తున్నారు. పుట్టెడు దు:ఖంతో చలించిపోతున్నరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆఖరికి రాముడిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం సిగ్గుచేటు.అయోధ్యలో

రామమందిరం కోసం ఉద్యమించింది బిజెపి.. వందల ఏండ్ల భారతీయుల కలను సాకారం చేసింది. కాంగ్రెస్ పార్టీ రామమందిర ఉద్యమాన్ని వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా కేసులు పెట్టింది. రాముడి

ఆనవాళ్లను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.శ్రీరాముడు ఈ దేశానికి ఆదర్శమూర్తి. ఆయన భారతీయుల, హిందువుల ఆరాధ్యదైవం. పరిపాలన అంటే ఏమిటో, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో, అన్నదమ్ముల మధ్య ఐక్యత

ఎలా ఉండాలో ఆయన జీవితం ద్వారా నేర్పించారు. ఈ విలువలు కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం వాళ్ల దురదృష్టం. అందుకే మహేశ్ కుమార్ గౌడ్ గారు ఆలోచించుకోవాలి. రాముడిని వ్యతిరేకించడమేనా వారి రాజకీయ

ధోరణి?రాజకీయాల్లో ఆరోపణలు సహజం. వ్యక్తుల గురించి, పార్టీల గురించి మాట్లాడుకోవచ్చు. కాని దేవుళ్ల గురించి, ధర్మం గురించి జాగ్రత్తగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం.ధర్మం గురించి, రాముడి

గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీలో పది మంది ముఖ్యమంత్రులు.. మంత్రులు ప్రతి వంద కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడుతూ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నరు.

హెలీకాప్టర్ లో పోవడం కోసం కొట్లాడుతున్నరు.హెలీకాప్టర్లు.. ఢిల్లీ టూర్లు.. స్పెషల్ ట్రైన్లు.. ఇది కాంగ్రెస్ పాలన. దమ్ముంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న హామీలు, 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి.

ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. లేకుంటే చేతగాకపోతే తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని హెచ్చరిస్తున్నాం.ఎమ్మెల్సీ కవిత.. ఇంట్లో కుటుంబమే రానియ్యడం లేదు. ఏకాకిగా

మారారు. సొంత పార్టీ నాయకులే కవితపై విమర్శులు చేస్తున్నరు. ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన కవిత ఏనాడు బీసీల కోసం పనిచేయలేదు. బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 22 శాతానికి తగ్గించింది కేసీఆర్ పాలనలోనే..

ఇప్పుడు బీసీల పట్ల కపట ప్రేమ చూపించడం సిగ్గుచేటు.ఎమ్మెల్సీ కవిత తన కుటుంబంలో ఆస్తుల గొడవ జరుగుతోంది. దాంతో ప్రస్టేషన్ లో ఆమె ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్