- Advertisement -
ఇథనాల్ కంపెనీకి అనుమతులిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
It is the BRS government that gave permission to the ethanol company
హైదరాబాద్
గాంధీభవన్ లో గురువారం నాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీడియా తో మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం దిలావర్ పూర్ లో ఇథనాల్ కంపనీ కి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు.
పర్మిషన్ ఇచ్చింది కేసిఆర్, కేటీఆర్. ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది అక్కడికి వెళ్లి అడుగుదాం రా… కేటీఆర్. తలసాని వియ్యంకుడు సుధాకర్, తలసాని కుమారుడు కంపనికి డైరెక్టర్లు. ప్రజలను తప్పుదోవ పట్టించే చిల్లర.. కుళ్ళు రాజకీయాలు టిఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు.
తప్పులు చేసింది.. విధ్వంసం చేసింది మీరు.. మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టేది మీరే. అధికారులను నిర్బంధించడం,దాడులకు కుట్రలు చేస్తున్నారు. వాస్తవాలు ఆలస్యంగా అయినా బయటకి వస్తాయి. కేటీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే.. రైతుల మీద ప్రేమ ఉంటే. దిలవార్ పూర్ కి రా కేటీఆర్.. నేను వస్తాను. ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలుద్దాం. డిల్లీ పెద్దల పర్మిషన్ ఇప్పించింది కూడా కేటీఆర్,కేసిఆర్ లే నని అన్నారు.
గ్రామ సభలు పెట్టాలనే రూల్ ఉన్న అదేం పాటించలేదు. కేటీఆర్ నీకు నీతి, జాతి ఏం అయిన ఉంటే పర్మిషన్ ఎవరు ఇచ్చారో తేలుద్దాం. దీలవర్ పూర్ రైతుల తో చర్చకు వస్తారా కేటీఆర్. అసెంబ్లీ లో కూడా దీని మీద చర్చ పెట్టడం జరుగుతుంది. స్పీకర్ ముందు అన్ని ఆధారాలు పెట్టి చర్చ చేపడతాం. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ లలో రాత్రికి రాత్రి రైతులను ఊర్లు ఖాళీ చేయించారు. మేము అలా చేయడం లేదు.. దిలవార్ పూర్ లో గ్రామ సభకు జరుగుతున్నాయి.. తర్వాత ప్రభుత్వం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. ఫుడ్ పాయిజన్ ఘటన మీద ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర మంత్రులు శైలజను పరామర్శించారు. మా ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలిచింది. ఆ విద్యార్థికి 25 రోజులు చికిత్స అందించాం, 15 లక్షలు వైద్య ఖర్చులు చేశామని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఎన్నో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి, ఎంతోమంది విద్యార్థులు మరణించారు. విద్యార్థుల మరణాలకు సంబంధించి ఇవే ఆధారాలు. బీఆర్ఎస్ హయంలో మరణించిన విద్యార్థుల జాబితాను మీడియా విడుదల చేసారు సీతక్క.
మీ పాలనలో విద్యార్థులు మరణించిన అప్పుడు పట్టించుకోలేదు, కనీసం పరామర్శించలేదు, పైసా పరిహారం ఇవ్వలేదు. శైలజ కుటుంబానికి మా ప్రభుత్వం న్యాయం చేస్తుంది. హాస్టల్ లలో ఫుడ్ పాయిజన్ మీద కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు మాకు ఉన్నాయని అన్నారు. అధికారులు ఎవరైనా కుట్రలకు సహకరిస్తే చర్యలు తప్పక తీసుకుంటాం.
రాజకీయ నాయకులు వెనక ఉండి కుట్రలు చేస్తున్నారనే డౌట్ వస్తున్నాయి. ఆధారాలతో బయటపెట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు.
- Advertisement -


