వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే
మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ రాములు
జగిత్యాల
:వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని,ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలంధిస్తున్నామని మాతా శిశు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు అన్నారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ,ఆర్.ఎం.పి.,పి.ఎం.పి.శాఖ ల ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్లు రాములు,శ్రీధర్,నవీన్,సునీల్,ఆజం,శాంత,కవిత,అరుణ,లను,పి.ఎం.పి.అధ్యక్షుడు రాజా గోపాల్ చారిలను సీనియర్ సిటిజెన్ల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,రాజ్ గోపాల్ చారీలు పట్టు శాలువాలు, మెమోంటో లు అందించి ఘనంగా సన్మానించారు. డాక్టర్ రాములు మాట్లాడుతూ డాక్టర్లపై అపోహలు వద్దని,ప్రజల ఆరోగ్యమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.
సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్లు ప్రత్యక్ష దేవుళ్ళని,తెలంగాణను ఆరోగ్య తెలంగాణ మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడం హర్షణీయమన్నారు.మాతా శిశు కేంద్రం,ప్రభుత్వ ప్రాంతీయ వైద్య శాలల్లో డాక్టర్లు అందిస్తున్న సేవలను కొనియాడారు.
జగిత్యాల జిల్లా మెడికల్. హబ్ గా మారడంతో జిల్లా ప్రజలకి ప్రభుత్వం తరపున ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్ సేవలు , 60 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందజేస్తున్నారని డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాములు,ఆర్.ఎం.ఓ.లు శ్రీధర్,నవీన్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,
ఆర్.ఎం.పి. అధ్యక్షుడు జి.రాజ్ గోపాల్ చారి,డాక్టర్లు,మెడికల్ కాలేజీ విద్యార్థులు,వైద్య సిబ్బంది,సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.



