Tuesday, March 18, 2025

నష్టాల్లో ఐటీ స్టాక్స్…

- Advertisement -

నష్టాల్లో ఐటీ స్టాక్స్…
ముంబై మార్చి 13, (వాయిస్ టుడే)

IT stocks in losses...

భారత ఐటీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం కుప్పకూలడంతో దేశీయ టెక్ స్టాక్స్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల ప్రకటన, అమలుతో అమెరికాలో మాంద్యం వస్తుందనే కొత్త భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అక్కడి స్టాక్ మార్కెట్లో పడిపోతున్నాయి. అలాగే అమెరికా మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానం దాటవేయడం ఇన్వెస్టర్లను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. అగ్రరాజ్యంలో ఆర్థిక వృద్ధి మందగించిన క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల పడుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్ల పని తీరుపైనే భారత ఐటీ స్టాక్స్ ఆధారపడి ఉంటాయి.అమెరికా వృద్ధి నెమ్మదించినట్లయితే భారత ఐటీ కంపెనీల రెవెన్యూ పడిపోతుంది. అందుకే భారత ఐటీ కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో ఐటీ స్టాక్స్ నష్టాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టీ ఐటీ సూచీ 2.2 శాతం తగ్గి 36,826 పాయింట్ల స్థాయికి పడిపోయింది. 2024, జులై తర్వాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. నిఫ్టీ ఐటీ సూచీలో ఉన్న 10 స్టాక్స్ నెగిటివ్ గానే ట్రేడయ్యాయి. అత్యధికంగా ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు 3.2 శాతం మేర పడిపోయాయి. విప్రో, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, కోఫోర్జ్ వంటి కంపెనీల షేర్లు 1 నుంచి 2 శాతం మేర క్షీణత నమోదు చేశాయి. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ అమెరికాలో మాంద్యం ముప్పు పొంచి ఉందా? అని అడగగా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమాధానం చెప్పలేదు. ఇన్వెస్టర్లంతా ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడా, మెక్సికో, చైనా దేశాలపై ప్రతీకార సుంకాలు పెంచడం కన్సూమర్ డిమాండ్ తగ్గిస్తోంది. కార్పొరేట్ పెట్టుబడులు సైతం తగ్గుముఖం పడతాయి. ఈ ఆందోళన క్రమంలో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు నమోదు చేస్తున్నాయి.
3 నెలల్లో 20 శాతం తగ్గిన నిఫ్టీ ఐటీ సూచీ
అమెరికా ఆర్థిక వృద్ది మందగమనం, మాంద్యం భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఐటీ స్టాక్స్ భారీగా అమ్మేస్తున్నారు. నిఫ్టీ ఐటీ సూచీ మూడు నెలల్లోనే దాదాపు 20 శాతం మేర పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత ఆలస్యం చేస్తుందనే అంచనాలు సైతం ఐటీ స్టాక్స్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్