Monday, March 23, 2026

అసెంబ్లీలో వార్ వన్ సైడ్…

- Advertisement -

అసెంబ్లీలో వార్ వన్ సైడ్…
హైదరాబాద్, మార్చి23, (వాయిస్ టుడే)

It was a one-sided battle in the Assembly.
తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం అసెంబ్లీ వేదికగా శరవేగంగా మారుతోంది. గత పదేళ్లుగా సభను శాసించిన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో అధికార పక్షం సంధిస్తున్న విమర్శలకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న అగ్రెసివ్ స్ట్రాటజీ, ప్రతిపక్షనేత కేసీఆర్ సభకు గైర్హాజరు కావడం.. ఈ రెండు అంశాలు సభలో చర్చను వార్ వన్ సైడ్ మారుస్తున్నాయిప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష

నాయకుడి పాత్ర అత్యంత కీలకం. కానీ, కీలకమైన బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ దూరంగా ఉండటం అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. కేటీఆర్, హరీష్ రావు వంటి

హేమాహేమీలు ఉన్నప్పటికీ, సభను తన వాక్చాతుర్యంతో, చారిత్రక ఆధారాలతో అదుపులోకి తెచ్చుకునే కేసీఆర్ మార్క్ వ్యూహం ఇక్కడ కొరవడింది. ప్రజలు ఎన్నుకున్నా సభకు రావడం లేదనే అంశాన్ని రేవంత్ రెడ్డి

ఒక అస్త్రంగా మార్చుకున్నారు. ప్రజాధనం జీతంగా తీసుకుంటూ సభకు రాకపోవడం బాధ్యతారాహిత్యం అనే విమర్శను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాన్ని ఇరకాటంలో

పెట్టడంలో సఫలీకృతం అవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు ఉపయోగించిన సాక్ష్యాధారాల వ్యూహాన్నే ఇప్పుడు రేవంత్ తిరిగి వారిపైనే ప్రయోగిస్తున్నారు. బీఆర్ఎస్ ఏదైనా ప్రజా సమస్యను లేవనెత్తినప్పుడు,

రేవంత్ రెడ్డి వెంటనే గత పదేళ్లలో జరిగిన వైఫల్యాలను, శ్వేతపత్రాలను బయటపెడుతున్నారు. దీంతో చర్చ ప్రస్తుత సమస్యల నుంచి మళ్ళీ పాత ప్రభుత్వ తప్పుల వైపు మళ్లుతోంది. కేటీఆర్ వేసే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి

అంతే దీటుగా, తనదైన శైలిలో తెలంగాణ యాసతో విరుచుకుపడుతున్నారు. ఇది సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఉత్సాహాన్ని నింపుతుండగా, బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడిపోతోంది.సభలో బీఆర్ఎస్ గళాన్ని కేటీఆర్, హరీష్

రావు వినిపిస్తున్నప్పటికీ, వారి మధ్య సమన్వయం కంటే డిఫెన్స్ కే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఆరు గ్యారెంటీలపై కేటీఆర్ చేసే కొన్ని సవాళ్లు, ప్రభుత్వం వద్ద ఉన్న పాత ఫైళ్ల వల్ల తిరిగి పార్టీకే

ఇబ్బందిగా మారుతున్నాయి. హరీష్ రావు గణాంకాలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, మంత్రులందరూ ఏకతాటిపైకి వచ్చి ఆయనను అడ్డుకుంటున్నారు.బీఆర్ఎస్ మళ్ళీ సభలో పట్టు సాధించాలంటే

కేసీఆర్ రాక తప్పనిసరి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధినేత సభలో ఉంటే ఎమ్మెల్యేల్లో ఉండే ధైర్యం వేరు. ప్రస్తుతం సభలో అజెండాను ప్రభుత్వం సెట్ చేస్తోంది. దాన్ని ప్రతిపక్షం వైపు

తిప్పుకోవాలంటే కేసీఆర్ అనుభవం, విషయ పరిజ్ఞానం అత్యవసరం. ప్రస్తుతానికి తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ యుద్ధంలో గెలవాలంటే సైన్యం మాత్రమే సరిపోదు, సేనాని

కూడా రంగంలో ఉండాలి. కేసీఆర్ సభకు వస్తే తప్ప ఈ వన్ సైడ్ వార్ రసవత్తరమైన ద్వైపాక్షిక పోరుగా మారే అవకాశం లేదు.
రేవంత్ పంచ్ లు
కేసీఆర్ కు అసెంబ్లీకి రాకున్నా ఇస్తున్న జీతం కోటి.. రాక మాత్రం అంటిముట్టనట్టు” అంటూ రేవంత్ రెడ్డి సంధిస్తున్న బాణాలు గులాబీ క్యాడర్‌కు గుచ్చుకుంటున్నాయి. “ప్రజాధనం తీసుకుంటూ.. ప్రజల గొంతుక

వినిపించరా?” అంటూ రేవంత్ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గులాబీ తమ్ముళ్లు నీళ్లు నములుతున్నారు. కేసీఆర్ ఉండి ఉంటే తనదైన శైలిలో ‘ఏం తమ్మి.. ఏం మాట్లాడుతున్నావ్?’ అని కౌంటర్

ఇచ్చేవారేమో కానీ, ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.కేటీఆర్ అస్త్రంగా ఆరు గ్యారెంటీలు ఏవి? నిరుద్యోగ భృతి ఏమైంది? అంటుంటే.. రేవంత్ మీ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలు ఏవి? ఆ ప్రాజెక్టుల అంచనాలు

ఏమయ్యాయి? అంటూ నిలదీస్తున్నారు. చర్చ ప్రజా సమస్యల మీద జరగాల్సింది పోయి, “నువ్వు ఎక్కువ తిన్నావా.. నేను ఎక్కువ తిన్నానా?” అన్న చందంగా పాత రికార్డుల దుమ్ము దులిపే కార్యక్రమంగా

మారిపోయింది. కేసీఆర్ మార్క్ వ్యూహచతురత లేకపోవడంతో రేవంత్ దూకుడు ముందు కేటీఆర్ వ్యూహాలు “తేలిపోయిన అప్పడాల్లా” మారుతున్నాయని విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. అసెంబ్లీలో రేవంత్

రెడ్డి ఏకపక్షంగా సాగిస్తున్న ఈ ‘వన్ సైడ్ వార్’ ఆపాలంటే, గజ్వేల్ సింహం గర్జించాల్సిందే అని పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “సార్.. మీరు రండి సార్.. లేకపోతే రేవంత్ అన్న మాకు

చుక్కలు చూపిస్తున్నాడు” అని లోలోపల మదనపడుతున్నారు.మొత్తానికి కేసీఆర్ రాకపోయేసరికి అసెంబ్లీలో బీఆర్ఎస్ పరిస్థితి “కెప్టెన్ లేని టీమ్ ఇండియా”లా తయారైంది. మరి కేసీఆర్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు?

రేవంత్ స్పీడ్‌కు ఎప్పుడు బ్రేక్ వేస్తారు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్