ప్రజాభిప్రాయం మేరకే ప్రత్యేక జిపి చేయాలనీ తీర్మానం
It was decided to make a special GP based on public opinion
మాజీ మంతి ఈశ్వర్ సూచనలతోనే గ్రామసభ
ఇందులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రమేయం లేదు
బతికేపల్లి మాజీ ప్రజాప్రతినిధులు వెల్లడి
జగిత్యాల,
జిల్లా లోని
పెగడపల్లి మండలం
బతికేపల్లి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన కొండయ్య పల్లి, పుల్లయ్యపల్లి అనుబంద గ్రామాలు కొండయ్య పల్లి గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలంటూ 2016-17 లో అప్పటి గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి అప్పటి మంత్రి,ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు అందజేయడం జరిగిందని బతికేపల్లి మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు తెలిపారు.
బుధవారం బతికేపల్లిలోవారు విలేకరులతో మాట్లాడుతూ
కొప్పుల ఈశ్వర్ సూచనలతో కొండయ్య పల్లి లో గ్రామసభ నిర్వహించడం ప్రజాభిప్రాయ సేకరణ సేకరించడం జరిగిందన్నారు. అప్పటి ప్రజాభిప్రాయ సూచనతోనే గ్రామపంచాయతీగా కావాలంటూ పుల్లయ్య పల్లె, కొండయ్య పల్లె గ్రామస్తులు కోరడం జరిగిందని వారు వివరించారు . అందులో మాజీ జెడపిటిసి లక్ష్మీనారాయణ రెడ్డి వర్గానికి చెందిన వారు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడి గ్రామస్తులను పోగుచేసుకొని పక్కదారిని పట్టిస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
అప్పటి తీర్మానం ప్రకారం అక్టోబర్ 2023లో గ్రామసభ, గ్రామ పంచాయతీ పాలకవర్గ తీర్మానం చేసి ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు,జిల్లా కలెక్టర్ కు తీర్మానం కాపీ అందజేయడం జరిగిందని వివరించారు.
జీవన్ రెడ్డిని విమర్శించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెబుతూ ఒక కుటుంబ క్షేమం కోసమే పుల్ల య్యపల్లి, కొండపల్లి గ్రామస్తులను క్యాస లక్ష్మీనారాయణ రెడ్డి కుటుంబ వర్గీయులు పోగు చేసుకుని ఉద్దేశపూర్వకంగానే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు.
ఇది ఆ రెండు గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకే తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తాటిపర్తి శోభారాణి, ప్రభాకర్ రెడ్డి, మద్దెల విమల సుధీర్, మాజీ ఎం పి టి సి కృష్ణ హరి, మాజీ ఉపసర్పంచ్ జక్కుల మల్లేశం, గ్రామస్తులు మన్నే గంగ రాజం, బాలుసాని మల్లేశం, అనిల్, శ్రీను గౌడ్, అశోక్ గౌడు, పోచంపల్లి రవి, పోచంపల్లి శ్రీను,లచ్చయ్య గౌడ్,
సుంకే అంజయ్య, పర్ష గంగయ్య, పెద్దరాయమల్లు, నంగిసాగర్, దుర్గాప్రసాద్, రవి మద్దెల అశోక్, బాల్సాని అనిల్, దుర్గాప్రసాద్, ముంజ అశోక్ గౌడ్, బాలసాన్ని మల్లేశం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.