- Advertisement -
బాబును అరెస్టు చేయడం జగన్ చేసిన తప్పు
It was Jagan's mistake to arrest Babu
రాజమండ్రి
చంద్రబాబును అరెస్ట్ చేయడం జగన్ చేసిన అతి పెద్ద తప్పు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీలో అధికారం మారేందుకు అదే బలమైన కారణం అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు. అధికారులపై కేసులు పెట్టే అంశంపై జగన్ తప్పు చేశారని చెప్పారు.కక్షసాధింపు చర్యల వల్ల అధికారుల తీరు మారుతుందని… భవిష్యత్తులో సీఎంల మాట ఐపీఎస్ అధికారులు వినే అవకాశం ఉండదని అన్నారు.ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు రూ. 900 కోట్ల ఆస్తులను చూపించారని… చంద్రబాబు చట్టం ప్రకారం నడుచుకునే వ్యక్తి అని ఉండవల్లి చెప్పారు. అయితే మార్గదర్శిపై మాత్రం చంద్రబాబు అభిమానం చూపారని తెలిపారు.మార్గదర్శి కేసు విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. ఈ నెల 11న మార్గదర్శి కేసు వాయిదా ఉందని… ఆ వాయిదాలో ఏపీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.
- Advertisement -