- Advertisement -
ఇది మంచి ప్రభుత్వం
It's good government
కాకినాడ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమమే ‘ఇది మంచి ప్రభుత్వం’. ఈ పేరిట స్టిక్కర్లు, కరపత్రాలు ముద్రించారు. శుక్రవారం నుంచి 26వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది కలిపి గ్రామాలకు, మునిసిపల్ వార్డులకు వెళ్లాలి. ప్రభుత్వం ఈ వంద రోజుల్లో చేసిన ఆరు పెద్ద కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలి. ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించాలి.కరపత్రాలు అందచేయాలి. ఇది ఈ కార్యక్రమాల లక్ష్యం. శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 62 మండలాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది..
- Advertisement -


