రాహుల్ గాంధీ ప్రియాంకలే ఇక్కడ పోటీ చేస్తున్నారు
ఆదివాసి బిడ్డ పోటీ చేస్తే ఇంత అక్కస
గిరిజను దొరసాని అనసూయ ఛత్తీస్ ఘడ్ లో వేల కోట్లు దోచుకొని తెలంగాణలోని 30 నియోజకవర్గాలకు డబ్బు సంచులు పంపిస్తోంది.
20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆమె చేసింది ఏంటి?
మళ్లీ కాంగ్రెస్ కు ఓటేస్తే మనమే నాశనం కొనితెచుకున్నట్టు
తనను గెలిపించి ఆశీర్వదించాలి
ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి
ములుగు: ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేది ధనసరి అనసూయ కాదని, ప్రియాంక, రాహుల్ గాంధీలే నని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ఒక ఆదివాసి బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఓర్వలేక ఢిల్లీ నుంచి ప్రియాంక, రాహుల్ గాంధీ లను పిలిపించి మరీ సీతక్క సభ పెట్టించిందని అన్నారు. ఛత్తీస్గడ్లో వేల వేల కోట్లు దోచుకుని వాటిని తెలంగాణలోని 30 నియోజకవర్గాలకు డబ్బు సంచులను పంపిణీ చేస్తోoదని అన్నారు. ఆమె నిజమైన ఆదివాసి బిడ్డ కాదని..గిరిజన దొరసాని అని అన్నారు. మంగళవారం పొట్లాపూర్ పత్తిపల్లి, చింతకుంట, చింతలపల్లి, చిన్న గుంటూరు పల్లి, కోడిశాల కుంట తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 ఏళ్లు అధికారంలో ఉన్న ఆమె ములుగు ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. వేల కోట్లు సంపాదించి నియోజకవర్గంలో వెదజల్లుతుందని ఆరోపించారు.
ఆమె దగ్గర పని చేస్తున్న పీఏ లకే 10 కోట్లు 20 కోట్ల విలువైన ఇండ్లు ఉన్నాయని ఆమె అన్నారు.అవినీతి సొమ్ముతో ఈ ప్రాంత యువతకు తాగించి వారి ఆరోగ్యం పాడయ్యే విధంగా కాంగ్రెస్ నేతల చర్యలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీకి గులాములుగా మారి ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోకపోగా.. ప్రశ్నించే గొంతుక అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని అన్నారు. తెలంగాణ రైతులకు 24 గంటల కరెంటు ఇస్తుంటే అనసూయ మాత్రం రైతులకు ఉచిత కరెంటు ఎందుకని మాట్లాడుతున్నారని అన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలు మన నాశనం మనమే కొని తెచ్చుకున్నట్టేనని అన్నారు. మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు వెల్లడించారు. పొ ట్లాపూర్ గ్రామంలో అన్ని వీధులకు సీసీ రోడ్లు వేయడంతో పాటు గోదావరి నీళ్లతో ఈ ప్రాంత భూములు సస్యశ్యామలమయ్యే విధంగా కృషి చేస్తానని అన్నారు.