రైతును రాజును చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది…
It's the Congress government's responsibility to make the farmer a king.
మంత్రి తుమ్మల…
రంగారెడ్డి
షాద్ నగర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అథితిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ..కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ నూతన ఛైర్మెన్ సులోచన తో పాటు డైరెక్టర్లకు ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం సభలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ మాట్లాడుతూ….. ధనిక రాష్ట్రమైన తెలంగాణ బి ఆర్ ఎస్ అప్పుల పాలు చేసిందన్నారు. ఇంత అప్పులో ఉన్నా కూడా 47 వేల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించమన్నారు. 22 లక్షల మందికి 18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసామన్నారు. తెల్ల రేషన్ కార్డు లేని, వివిధ టెక్నీకల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయిన సుమారు 3 లక్షల మంది రైతులకు మహబూబ్ నగర్ లో జరగబోయే రైతు పండగ రోజు రుణ మాఫీ వేస్తామన్నారు. సన్న రకం పందిస్తున్న రైతులకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామన్నారు. తెలంగాణ బియ్యం బయటి దేశాల వారు కోరుకుంటున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాకు ఇరిగేషన్ కల్పిస్తామన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఎలాంటి ప్రాజెక్ట్ అయినా ఎక్కువే కేటాయిస్తామన్నారు. రైతును రాజునూ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్నీ హామీలు నెరవేరుస్తామన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతి వ్యవస్థలో అవినీతి ఉండేదన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఒక అతి పెద్ద మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే నూతనంగా కొందుర్గు మండలానికి మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. RRR వస్తే షాద్ నగర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లా కు సంబంధించిన అందరి రైతుల సమస్య లను దృష్టి లో పెట్టుకుని ఇక్కడే ఒక మోడల్ మార్కెట్ ను ఏర్పాటు చేసి అందులోనే కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేసి విదేశాలకు ఇక్కడి నుంచే కూరగాయలు ఎగుమతి చెసే దిశగా చేస్తామని హామీ ఇచ్చారు