Friday, November 22, 2024

జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి

- Advertisement -

జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
కర్నూలు, మార్చి 28
రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌( ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమయ్యిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వా్నికి ఏడు ప్రశ్నలకు సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా , సీపీఎస్‌ రద్దు, మద్య నిషేదం, ఏటా జాబ్‌ క్యాలెండర్ మెగా డీఎస్సీ డా మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని అన్నారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని.. రాష్ట్ర భవిష్యత్ కోసం మూడు పార్టీలు కలిశామని ప్రజలకు తెలిపారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు టీడీపీకి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతిఒక్కరూ ముందుకురావాల్నారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడవద్దు ..జగన్ ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలన్నారు. విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారు విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేశారు .. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్నింటి ధరలను పెంచుకుంటూ పోయారని మండిపడ్డారు. అసమర్థుడు, అవినీతిపరుడిని ఇంటికి పంపాలన్నారు. మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచేశారు , నాసిరకం మద్యంతో అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి తెచ్చారన్నారు. నాసిరకం మద్యం తాగి కొంతమంది చనిపోయారు .. ఆఖరికి ఇసుకపైనా దోపిడీ చేశారని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికులను నాశనం చేశారు ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. రాప్తాడులో ఇసుక దొరకదు.. ఇక్కడి ఇసుక బెంగళూరులో దొరుకుతుందన్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచేశారు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. తాను సీఎం కాగానే మొదటి సంతకం డీఎస్సీ మీద పెడతాన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. రాయలసీమకు రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. జగన్ ఐదేళ్లలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని రాయలసీమ ద్రోహి జగన్ అని మండిపడ్డారు. రాయలసీమకు జగన్ రాజకీయ హింస తెచ్చారని.. వైసీపీ మాఫియా, సైకో రాజ్యంగా మార్చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో ముంచేసింది . గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత మాది .. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత కూడా తీసుకుంటామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్