- Advertisement -
బయటకొస్తున్న జగన్ జల్సాతనం
Jagan original behavior is coming out
విజయవాడ, డిసెంబర్ 21, (వాయిస్ టుడే)
జగన్‌కు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఖర్చు చూస్తుంటే అధికారులు షాకవుతున్నారు. ప్రజా ధనాన్ని ఈ విధంగా చేయవచ్చా అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. ఏపీని వైసీపీ 2019-24 వరకు పాలించింది. ప్రభుత్వం ఎలాంటి జీవోలు జారీ చేసినా సీక్రెట్‌గా ఉంచేది. బయటకు రాకుండా చూసేది అప్పటి యంత్రాంగం. కొందరు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. అయినా అధికారుల్లో మాత్రం చలనం రాలేదు.వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ విలాసాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీతంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకునేవారు. జగన్ నిర్ణయాన్ని చాలామంది స్వాగతించారు. ఎన్టీఆర్ తర్వాత ఆ విధంగా తీసుకున్నవారిలో జగన్ మాత్రమేనని తెగ డప్పుకొట్టారు.టీడీపీ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టింది. అందులో కీలక విషయాలు బయటపెట్టింది. 20 లక్షలు ఖర్చుకాని హెలిప్యాడ్ నిర్మాణం కోసం ఏకంగా రూ.8.60 కోట్ల కేటాయించారట. ఏ రేంజ్‌లో జల్సాలు చేశారో అంటూ రాసుకొచ్చింది. ప్రపంచంలో ఏ నియంత ఇలాగ చేసి ఉండరేమో!నని రాసుకొచ్చింది.ప్రజా సేవ చేయాలని అధికారమిస్తే దాన్ని అడ్డు పెట్టుకుని ఎంతకు తెగించారో కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇంటి చుట్టుపక్కలే కాదు.. హెలికాఫ్టర్ ఎక్కేచోటు జనం కనిపించకూడదని ప్రత్యేకంగా హెలిప్యాడ్ నిర్మించారని రాసుకొచ్చింది.ఇంకాస్త వెనక్కి వెళ్తే.. జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన ఖర్చును ఒకొక్కటిగా బయటకు తీస్తోంది కూటమి సర్కార్. కేవలం ఎగ్ పఫ్స్ కోసం దాదాపు 3.62 కోట్లపైగానే ఖర్చు చేసింది. ఈ విషయం తెలిసి ఏపీ ప్రజలు షాకయ్యారు. ఇక పేపర్, పెన్ను ఖర్చుల కోసం ఏకంగా 9.84 కోట్లు ప్రజాధనం వృధా చేశారని బయటపెట్టింది కూటమ సర్కార్.అందుకు సంబంధించి జీవోను బయటపెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక తాడేపట్టి ప్యాలెస్ కోసం ఇంటి చుట్టూ ఇనుప కంచె నిర్మాణం చేశారు. దానికి ఖర్చు అక్షరాలా 12.85 కోట్ల రూపాయలు. కంచె బరువు ఈశాన్య బరువు పెరిగిందని పండితులు చెప్పడంతో దాన్ని తొలగించే పనిలో పడ్డారట.ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు ఒక్క రూపాయి జీతం ఎందుకు తీసుకున్నారో ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని అంటున్నారు. మాజీ సీఎంకు సంబంధించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. జగన్ ఖర్చులన్నీ చూసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఆలోచనను మార్చుకున్నట్లు కొందరు చెబుతున్నారు. అందుకోసమే జీతం తీసుకోవడానికి పవన్‌కల్యాణ్ అంగీకరించారని అంటున్నారు.
- Advertisement -