విశాఖపట్టణం, అక్టోబరు 30, (వాయిస్ టుడే): విజయనగరం జిల్లాలోని కొత్త వలస మండలం కంటాకపల్లిలో జరిగిన రైలు ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. అంతకుముందు విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను సీఎం జగన్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఆ వెంటనే అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను జగన్ పరామర్శించారు.తొలుత సీఎం జగన్ రైలు ప్రమాదం జరిగిన చోటును పరిశీలించాలని అనుకున్నారు. కానీ, రైలు అధికారుల సూచనతో దాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్, విద్యుత్ లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చెల్లా చెదురుగా పడిపోయిన బోగీలను తొలగిస్తున్నారు. సీఎం ఆ ప్రదేశానికి వెళ్తే పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే రైల్వే అధికారుల విజ్ఞప్తితో ఘటనా స్థలానికి గవెళ్లకుండా నేరుగా బాధితుల్ని పరామర్శించారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ప్రమాదానికి గురైనin బోగీల్ని తొలగిస్తున్న అధికారులు. ఈ క్రమంలో సీఎం పర్యటనతో పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఆయన నేరుగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు.‘‘విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
విచారణ ప్రారంభం
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.. పలాస రైలును రాయగుడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకోగా.. ఒకే ట్రాక్ పై ముందున్న పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. 50 మందికి తీవ్రగాయాలపాలయ్యారు.. ఇక, మరికొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.అయితే, విజయనగరం రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.. కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు కమిషన్ అధికారులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ.. ఓవైపు 20 గంటల తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయి.. ఈ ప్రమాదంలో నిజ్జునుజ్జయిన ఏడు బోగీలను తొలగించారు.. విజయవాడ-విశాఖపట్నం అప్ లైన్ & డౌన్ లైన్ పనులు పూర్తి చేశారు.. మిడిల్ లైన్ ఆపరేషన్స్ లోకి రావడానికి మరికొద్ది గంటల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.. అందుబాటులోకి వచ్చిన అప్ & డౌన్ లైన్లలో ట్రైన్ల రాకపోకల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు.. అయితే, ప్రమాదానికి గల పూర్తి కారణాలు సేఫ్టీ కమిషన్ విచారణ తర్వాత తేలనుంది.. పలాస ప్యాసింజర్ ను వెనుక నుంచి రాయగఢ్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని డీఆర్ఎం సౌరభ్ కుమార్ తెలిపారు.. ఇక, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని.. అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. కాగా, ఈ రైలు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు ప్రకటించిన విషయం విదితమే.