Wednesday, December 4, 2024

రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ద్రోహి జగన్ రెడ్డి

- Advertisement -

సభకు వచ్చిన ప్రజా ఉధృతి చెబుతోంది
మే 13న జరిగే ఓట్ల సునామీ ఎలా ఉంటుందో

అనంతపురంలో కియా మన బ్రాండ్…
జాకీ పారిపోవడం జగన్ రెడ్డి బ్రాండ్

దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల గొంతు కోశాడు

వివేకా హత్యపై జగన్ రెడ్డి చెప్పని అబద్దమంటూ లేదు

రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ద్రోహి జగన్ రెడ్డి

నీళ్లు ఇస్తే బంగారం పండించగల భూములు అనంతపురం సొంతం

మనం మహాశక్తితో ఆడబిడ్డను గౌరవిస్తే.. జగన్ రెడ్డి సొంత చెల్లెళ్ల పుట్టుకనూ ప్రశ్నిస్తున్నాడు

యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు రావాలి.. పోరాడాలి

అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం ‘ప్రజాగళం’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

పు ఎన్నికల్లో గెలుస్తున్నాం. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
శింగనమలలో ఈ సారి పసుపు జెండా ఎగరేయబోతున్నామని ఇక్కడకొచ్చిన జనం చూస్తే అర్ధమైపోతుంది.
ఈ ఎన్నికలు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మార్చే ఎన్నికలు.
సభకు వచ్చిన ప్రజా ఉదృతి చూస్తుంటే మే 13న జరగబోయే ప్రజా సునామీ కళ్లకు కనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నెమరు వేసుకునని ఓటు వేయాలి.
నరకాసుర వధ చేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవానికి గడువు 46 రోజులు మాత్రమే. బటన్ నొక్కా అని చెప్పే జగన్ రెడ్డి.. బటన్ నొక్కి వేస్తున్నదెంత, బొక్కుతున్నదెంతో సమాధానం చెప్పాలి.
ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయం, దోపిడీ గురించి ప్రతి ఇంట్లో చర్చ జరగాలి.
రూ.10 ఇచ్చి రూ.100 లాక్కుంటున్న జలగ ఈ జగన్ రెడ్డి.
కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక వరుసగా పెంచుకుంటూ పోయాడు. టీడీపీ హయాంలో రూ.200 ఉండే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.1000 అయ్యింది. దీనిపై చర్చించాలి.
పెట్రోల్ డీజిల్ ధరలు, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెరిగాయో, ఎంతలా పెరిగాయో ప్రజలు ఆలోచించుకోవాలి.
చెత్తపై కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జలగ. మద్యం క్వార్టర్ అప్పుడు రూ.60 ఉంటే.. ఇప్పుడు రూ.200 చేశాడు. ధరలు పెంచి, పేదల రక్తం తాగుతూ, తాడేపల్లి కొంప నింపుకుంటున్నాడు. కల్తీ మద్యం తాగి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. రేట్లు పెంచుకుంటూ పోవడం ద్వారా మద్య నిషేధం చేస్తానంటూ ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.
వీరోచితంగా పోరాడే యువత మన రాష్ట్రంలో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నాడు. మెగా డీఎస్సీ అన్నాడు. ఐదేళ్లు పూర్తైంది. ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడేనా?
మనం వస్తే పెట్టుబడులొస్తాయి. పరిశ్రమలొస్తాయి. ఉద్యోగాలొస్తాయి. అనంతపురంలో కియా మన బ్రాండ్. జాకీ పారిపోయిందంటే అది జగన్ రెడ్డి బ్రాండ్. పెట్టుబడులు తరిమేయడం జగన్ పని.. పెట్టుబడులు ఆకర్షించి యువతకు ఉద్యోగాలివ్వడం మన బ్రాండ్. ముఖ్యమంత్రిగా నా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే.
పిల్లలకు ఉద్యోగాలివ్వడం లేదు. గంజాయి, మద్యం, డ్రగ్స్ తెచ్చి యువత జీవితాలను నాశనం చేస్తున్నాడని అన్నారు.
పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించాలనుకుంటారు. జగన్ రెడ్డి అనే దుర్మార్గుడి పాలనలో ఉద్యోగాల్లేక మద్యం, గంజాయి, డ్రగ్స్ కి అలవాటు చేస్తున్నాడు.
ఓటింగ్ రోజున గ్రామాలన్నీ ఏకం కావాలి. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏకం కావాలి. మన భవిష్యత్తు కోసం అందరమూ పని చేయాలి.
రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన, సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమికొట్టి భవిష్యత్తును కాపాడుకుందాం.
ప్రతి ఒక్కరూ ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకి ఓటు వేయించేలా ఒప్పించాలి. భవిష్యత్తుకు గ్యారెంటీ కల్పించాలి.
జగన్ రెడ్డి అరాచకానికి ప్రతి వర్గమూ నష్టపోయింది. రైతులు, వ్యాపారులు, కూలీలు, ట్రాన్స్ పోర్టు రంగమూ నష్టపోయింది.
నష్టపోయిన ప్రతి రంగమూ అభివృద్ధిలోకి రావాలంటే, లాభాల్లోకి రావాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి.
దళితులందరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో 1996-97లోనే ఏ, బీ, సీ, డీ వర్గీకరణ తీసుకొస్తే. దాన్ని రాజశేఖర్ రెడ్డి నాశనం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ చేసేందుకు ముందుకు రావడం సంతోషకరం.
సామాజిక న్యాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ప్రజలు తెలుసుకోవాలి.
దళితులకు న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దళితుల గొంతు కోశాడు. దగా చేశాడని అన్నారు.
దళితుల కోసం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశఆడు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించాడు. కార్పొరేషన్లు నిర్వీర్యం చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్, కులాంతర వివాహాలు సహా అన్ని దళిత పథకాలు రద్దు చేశాడు.
విదేశాల్లో చదువుకునే వారికి అంబేద్కర్ విదేశీ విద్య తీసుకొస్తే.. అంబేద్కర్ పేరు తీసి ఈ దుర్మార్గుడి పేరు పెట్టుకున్నాడు.
దళితులకు స్వాతంత్ర్యం లేదు. నిలబడి మాట్లాడే

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్