ఒక్క దళితుడికి దర్శన భాగ్యం కలగలేదని చెప్పించు జగన్

- Advertisement -

 ఒక్క దళితుడికి దర్శన భాగ్యం కలగలేదని చెప్పించు జగన్

Jagan says that not a single Dalit has the fortune of vision

మాజీ సీఎం మాటలపై బిజెపి సవాల్

మాజీ సీఎం హోదాలో ఉన్న తనకే ..  తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం కష్టసాధ్యంగా మారిందని .. అలాంటిది దర్శన విషయంలో సామాన్య దళితుడి పరిస్థితి ఏమిటని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం .. కుల చిచ్చు పెట్టినట్లు ఉందని..  బిజెపి నేతలు భాను ప్రకాష్ రెడ్డి ,  కోలా ఆనంద్ , సామంచి శ్రీనివాస్ , డాక్టర్ శ్రీహరి రావు ,  పొనగంటి భాస్కర్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ముందు ఎంతటి వారైనా స్వల్పమేనన్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎంతటివాడో తేల్చుకోవాలన్నారు.  అసలు శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వడంలో ఇబ్బంది ఏమిటో తెలియజేయాలని జగన్ ను ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా  ఇతర మతస్తులు ఎంతటి వారైనా డెకరేషన్ ఇచ్చే వెంకన్నను దర్శించుకుంటారని స్పష్టం చేశారు.  శ్రీవారి దర్శన విషయంలో దళితులు ఎవ్వరైనా ఇబ్బంది పడుంటే మీడియా ముందు ప్రవేశ  పెట్టాలని సవాల్ విసిరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular