Sunday, December 22, 2024

క్యాడర్‌లో కదలిక కోసం జగన్

- Advertisement -

క్యాడర్‌లో కదలిక కోసం జగన్

Jagan waiting for movement in cadre

విజయవాడ, అక్టోబరు 11, (వాయిస్ టుడే)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ మారిపోతున్న నేతలు ఉన్న నియోజవవర్గాల నుంచి క్యాడర్ ను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అలాగే జిల్లాలకు పార్టీ అధ్యక్షుల్ని కూడా నియమిస్తున్నారు. వీలైనంత వరకూ సీనియర్ నేతల్ని నియమిస్తున్నారు. అందర్నీ యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జనవరిలో నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ లోపు పార్టీ కార్యకర్తలకు, క్యాడర్ కు నమ్మకం కలిగించేందుకు గుడ్ బుక్ ప్రస్తావన తీసుకు వచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారందర్నీ గుర్తుంచుకుంటామని గుడ్ బుక్‌లో పేర్లు రాసుకుని అధికారంలోకి రాగానే మేలు చేస్తామని అంటన్నారు. ఇందుకోసం ప్రభుత్వంపై భయపడకుండా పోరాడాలని పిలుపుస్తున్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత క్యాడర్ చాలా వరకూ సైలెంట్ అయిపోయింది. స్థానిక సంస్థల్లో ఉన్న క్యాడర్ పార్టీ మారిపోతోంది. పదవులు లేని వాళ్లు సైలెంట్ అయిపోతున్నారు. దీనికి కారణం టీడీపీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేధించడం వల్లేనని ఇప్పుడు వారు కూడా అదేబాటలో వెళ్తే తాము తీవ్రంగా ఇబ్బందలు పడాల్సి వస్తుందని ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. వీరందరికీ ధైర్యం ఇచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే లాయర్లను అందుబాటులో పెట్టారు. ఏవైనా కేసులు అయితే తాము అండగా ఉంటామని చెబుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు ఇప్పటికే సైలెంట్ అయ్యారు. చాలా మందిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జగన్ అందరికీ భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరవాత ఆయన వెంట ఉంటూ . పదేళ్ల పాటు ఆయనతో పాటు కలిసి నడిచిన వారిని అధికారంలోకి వచ్చాక జగన్ పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సోషల్  మీడియా కోసం పని చేసిన వారినీ పట్టించుకోలేదని చివరికి పెయిడ్ సోషల్ మీడియా పై ఆధారపడాల్సి వచ్చిందన్న అసంతృప్తి క్యాడర్ లో ఉంది. ఇక ద్వితీయ శ్రేణి నేతలు తమను జగన్ పూర్తిగా రోడ్డున పడేశారని అనుకున్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ తీసుకు రావడం వల్ల పాలనలో పార్టీ క్యాడర్ కు పని లేకుండా పోయిది. జగన్ కూడా వాలంటర్లకే ప్రాధాన్యం ఇచ్చారు. వారినే లీడర్లను చేస్తామని కూడా ప్రకటించారు. ఈ పరిణామాలతో గత ఎన్నికల్లో క్యాడర్ కూడా వైసీపీకి గట్టిగా పని చేయలేదన్న వాదన ఉంది. ఆ అసంతృప్తిని జగన్ గమనించారని అందుకే గుడ్ బుక్ అని చెబుతున్నారు. జగన్ బయటకు రాకుండా పార్టీ క్యాడర్ ను మాత్రమే తెరపైకి వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తే ఆ వ్యూహం ఫెయిల్ అవుతుందని జగన్ నాయకడిగా ముందుండి నడిపిస్తేనే  ప్రయోజనం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. అందుకే జగన్మోనహన్ రెడ్డి జనవరి నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటనలకు రెడీ అవుతున్నారని చెబుతున్నారు. వైసీపీ హయాంలో నారా లోకేష్, చంద్రబాబు పర్యటనల సమయంలో ఉద్రిక్త పరస్థితులు ఏర్పడేవి. జగన్ పర్యటనలో అలాంటివి ఏర్పడినా జగన్ ముందుకు వెళ్తే.. ప్రభుత్వాన్ని ఎదిరించవచ్చని.. గొడవలు జరుగుతాయని అనుకుని ఆగిపోతే క్యాడర్ లో ధైర్యం రాదని చెబుతున్నారు. మొత్తంగా జగన్ పార్టీ క్యాడర్ ను యాక్టివ్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే  చేస్తున్నారని అనుకోవచ్చు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్