చంద్రబాబుతో ఎందరు కలిసొచ్చిన మళ్లీ గెలిచేది జగనే: మంత్రి విడుదల రజిని

- Advertisement -

చంద్రబాబుతో ఎందరు కలిసొచ్చిన మళ్లీ గెలిచేది జగనే: మంత్రి విడుదల రజిని

గుంటూరు జిల్లా:డిసెంబర్

ఎపీ రాజకీయ నేపథ్యంలో చంద్రబాబు ను ప్రశాంత్ కిషోర్ నిన్న సాయంత్రం కలవడంతో ఒక్కసారిగా హాట్ టాఫిక్ గా మారింది.

అయితే, ఎంతమంది చంద్రబాబుతో కలిసి వచ్చి నా..వైఎస్‌ జగన్‌ను ఏమీ చేయలేరు..వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైయస్ జగనే అని మంత్రి విడుదల రజిని అన్నారు.

తాజాగా గుంటూరులో నేడు మీడియాతో మాట్లాడిన మంత్రి విడుదల రజిని ఎవరు ఎవరిని తెచ్చుకున్నా ఇక్కడ గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇస్తున్న భరోసాతో ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి నిలిచి పోతారన్న ఆమె ఎవరికి మద్దతు ఇవ్వాలో ప్రజలు డిసైడ్‌ అయిపోయారని మంత్రి రజని అన్నారు

ప్రజల ఆశీస్సులు జగన్మో హన్ రెడ్డికి, వైసీపీకే ఉన్నాయన్నారు. ఇక, పాదయాత్రలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలు చూశారని తెలిపారు రజిని.

వాళ్ల బాధలు తీర్చడానికే నవరత్నాలు అని మేనిఫెస్టో రూపొందించారన్న ఆమె.. ఈ రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యత చూసి ప్రతి ఒక్కరు సీఎంను తమ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నారని తెలిపారు..

దీంతో టీడీపీ ప్రజల్లో విశ్వ సనీయత కోల్పోయింద న్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి, మరోసారి జగన్ ను దీవించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని మంత్రి విడుదల రజిని తేల్చిపారేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular