- Advertisement -
కాకినాడు లో జగన్ జన్మదిన వేడుకలు
Jagan's birthday celebrations in Kakinada
కాకినాడ
మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.. కాకినాడ రమణయ్యపేటలోని క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా వైసిపి అధ్యక్షులు,మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున వైసిపి అభిమానులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు..ఈసందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీని స్థాపించి ప్రజల పక్షాల పోరాటం చేస్తూ గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు ఎన్నో సంక్షేమం,అభివృద్ధి పదాలు అందించి భారతదేశంలోనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అలాంటి నాయకుడుకి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు….ఈ కార్యక్రమంలో. రూరల్ జడ్పిటిసి నురుకుర్తి రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను,ఎంపీపీ విరీష,సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ,మాజీ కార్పొరేషన్ డైరెక్టర్లు నాగమణి, ప్రభాకర్, వైసిపి శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
- Advertisement -