- Advertisement -
టాప్ లిస్ట్ లో జగన్ సన్నిహితులు
Jagan's close friends in the top list
విజయవాడ, నవంబర్ 25, (వాయిస్ టుడే)
ఈ శాఖ..ఆ శాఖ అని ఏం లేదు. అవకాశం ఉందనుకున్న చోట..అవకాశమే లేదనుకున్న చోట..అన్నింటా ఓ రేంజ్‌లో ఊడ్చేశారట. ల్యాండ్, స్యాండ్, మైనింగ్, లిక్కర్, స్పోర్ట్స్ లాస్ట్‌కు రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదట. ఇదంతా గత వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన స్కామ్‌ల చిట్టా అని చెప్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో హాట్ టాపిక్‌గా ఉన్న ఇష్యూస్..ఇప్పుడు మరోసారి తెరమీదకు వస్తున్నాయి. రేపోమాపో యాక్షన్ ఉండబోతుందన్నట్లుగా మారిపోయింది సీన్. ఐదు నెలలుగా డైలీ ఎపిసోడ్‌గా కంటిన్యూ అవుతున్న సిరీస్‌లో.. ఒక్కో ట్విస్ట్‌ను రివీల్ చేస్తారట.స్కామ్‌లు..వాటి సూత్రధారులపై యాక్షన్‌కు టైమ్ వచ్చేసిందంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక వరుసపెట్టి కారుమబ్బులు కమ్మేయడం ఖాయమంటున్నారు. ఈ స్కామ్‌లపై చర్యల విషయంలో డైరెక్టుగా చంద్రబాబే రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. కుంభకోణాలు..వాటి వెనుకున్న కీలక నేతలే టార్గెట్‌గా..పోలీస్ ఆఫీసర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారట చంద్రబాబు. ఏ శాఖలో ఏం జరిగిందో..ఏ స్కామ్ కథేంటో అన్నీ తెలిసి కూడా యాక్షన్ తీసుకోకపోతే ప్రజల ఏమనుకుంటున్నారో మీరే చెప్పాలంటూ పోలీస్ ఉన్నతాధికారులనే ప్రశ్నించారట. దీంతో పోలీస్ బాస్‌లు ఉరుకులు పరుగులు పెట్టే పరిస్థితి వచ్చిందంటున్నారు.చంద్రబాబు చెప్తున్న ఐదారు స్కామ్‌లల్లో..వైసీపీ కీలక నేతల హస్తం ఉందన్నది ఓపెన్ సీక్రెట్ అలిగేషన్. ఆడుదాం ఆంధ్రాలో అప్పటి క్రీడా శాఖమంత్రి ఆర్కే రోజా, మైనింగ్ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రేషన్ బియ్యం ఇష్యూలో కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, భూ కబ్జాలు, లిక్కర్ లింకుల్లో వైసీపీ పెద్ద నేతల హస్తం ఉందని కూటమి నేతలు చెప్తున్నారు. ఇప్పటివరకు ఆరోపణల వరకే పరిమితమైన ఈ వ్యవహారంలో..కొన్ని లీడ్స్ దొరికినట్లు తెలుస్తోంది. అందుకే యాక్షన్ స్టార్ట్ చేయాలని.. స్లోగా ఉంటే కుదరదంటూ అధికారులకు ఆదేశాలిచ్చారట సీఎం చంద్రబాబు.పెద్ద పెద్ద స్కామ్‌ల వెనక ఉన్న కీలక నేతలు ఎవరో ఎక్స్‌పోజ్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిందేనని ఆర్డర్స్ ఇచ్చారట. ప్రత్యేకంగా సీఐడీ, ఏసీబీతో పాటు ఐదుగురు అత్యున్నత స్థాయి ఆఫీసర్లతో వన్ టు వన్ మీటింగ్ పెట్టిన బాబు..ఏ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది.. దర్యాప్తులో అసలేం జరుగుతోందో క్లారిటీ తీసుకున్నారట. ఇప్పటివరకు పలు కేసుల్లో జరిగిన దర్యాప్తు మీద అసంతృప్తి వ్యక్తం చేశారట చంద్రబాబు.చంద్రబాబు రంగంలోకి దిగడంతో నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. భూకబ్జాలు, ఇసుక దోపిడీ, మద్యం కుంభకోణం, మైనింగ్ అక్రమాలు, రేషన్ బియ్యం మాఫియా, ఆడుదాం ఆంధ్రా..లాంటి స్కామ్‌లలో..గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారిలో కొందరిని రాబోయే వారం రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఐదారుగురు కీలక నేతల్లో కనీసం ఒకరిద్దరు అయినా జైలుకు వెళ్లడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అయితే ముందుగా అరెస్ట్ అయ్యేదెవరనే దానిపై మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులు అంటూ అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి. అడ్డగోలుగా పోస్టులు పెట్టడమే కాదు అసభ్యంగా మాట్లాడిన వైసీపీ మద్దతుదారులను కేసులు వెంటాడుతున్నాయి. ఇలా ఒక్కొక్కరిని ఒక్కో కేసులో ఇరికించేస్తోంది కూటమి ప్రభుత్వం. కొడాలి నాని, వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది టీడీపీ. ఇక నెక్స్ట్ టార్గెట్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కీలకంగా వినిపిస్తోంది. ఆయనను ఏదో ఒక కేసులో కార్నర్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. స్యాండ్, మైనింగ్ విషయంలో పెద్దిరెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది.అంతేకాదు వైసీపీ టాప్ లీడర్లు, జగన్‌కు సన్నిహితంగా ఉన్నవారు కూడా కూటమి టార్గెట్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ వెనక జగనే ఉన్నారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. వీటన్నింటి మీద వరుస కేసులు నమోదు చేయడమే కాదు..సూత్రధారులు ఎంత పెద్దోళ్లు అయినా విడిచి పెట్టొద్దని ఆదేశాలు ఇచ్చారట సీఎం చంద్రబాబు. దీంతో ఈ మూడు నాలుగురోజుల్లో ఏదో బ్లాస్టింగ్ న్యూస్ రాబోతుందన్న చర్చ అయితే జరుగుతోంది.
- Advertisement -