జగ్గయ్యపేట: 99 శాతం హామీలు అమలు చేశానంటున్న జగన్మోహన్ రెడ్డి, లక్షల కోట్ల కుంభకోణాలు చేయకుంటే చంద్రబాబు ప్రజా పర్యటనలను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీఅధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ ప్రశ్నించారు.
సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసింది మనం చూసాం, ఎందుకు ఇది అంటే మొదటినుంచి చంద్రబాబు గారు ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితుల్లో ఏదిఏమైనా సరే ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వెయ్యాలనే ఒక దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు ని అరెస్టు చేశారు, 52 రోజులు పాటు నిర్బంధంలో ఉంచారని అన్నారు.
పూర్తి బెయిల్ మీద ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ రావడం తడవుగా కేవలం 12 గంటల్లోనే మళ్లీ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు, ఆ అప్పీల్ నిన్న బెంచ్ మీదకు రావడం మనం చూసాం, సుప్రీంకోర్టులో వారి వాదనను చూస్తే ఎంత తాపత్రయపడ్డారంటే చంద్రబాబు గారిని బెయిల్ మీద విచారించాలని అడిగితే బెంచ్ ఇది క్వాష్ పిటిషన్ ఉంది కాబట్టి దానిమీద తీర్పు వచ్చిన తర్వాత చెబుతామంటే అప్పటిదాకా రాజకీయ కళాపాలను బయటకి ప్రజల్లోకి వెళ్లకుండా మరి ఆర్డర్స్ ఇవ్వాలని కోరటం ఇది ఎంతటి దుర్మార్గపు ఎత్తుగడ, ఇంకా చంద్రబాబు గారిని ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని వారి ప్రయత్నమే మనకు కనబడుతుంది దాన్ని సాక్షి మీడియా వక్రీకరించి బయటకు ప్రచారం చేశారని అన్నారు.
బెయిల్ రద్దు వెంటనే విచారణ చేయాలని సిఐడి వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది, చంద్రబాబు రాజకీయ కలాపాలకు సుప్రీంకోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదు,
నిజంగా మంచి చేసుంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అని ప్రశ్నించారు, అబద్ధపు ప్రచారాలను ఎందుకు సాక్షి మీడియాలో చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొనకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని నీలి మీడియా చెబుతుంది,
సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టలేదనేది నిజం, స్కిల్ కేసులో మాత్రమే బయట మాట్లాడవద్దని చెప్పారు, సిఐడి కూడా మాట్లాడవద్దని చెప్పారు, చంద్రబాబు పర్యటన అడ్డుకోవడానికి జగన్ ఇంకా కుట్రలు చేస్తున్నాడు దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నార



