తెలంగాణ కాంగ్రెస్ లో మోస్ట్ సీనియర్ నేత, మాజీ సిఎల్పీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని.. వారంతా తనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. గత దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తాను ఆశించకుండానే ఎన్నో మంత్రి పదవులు నిర్వహించానని.. ప్రజలు కోరుకుంటే ముఖ్యమంత్రి పదవి సైతం వస్తుందని చెప్పుకొచ్చారు. 36 సంవత్సరాలకే మంత్రి పదవిని స్వీకరించిన.. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి వల్లనే ఇక్కడ భూ ములకి రెట్లు పెరిగినాయి అన్నారు. గ్రామ గ్రామానికి రోడ్లు అన్ని వేయిస్తము, అధికారం లోకి రాగానే చేపురు చేరువుకి తూము ఏర్పాటు చేయిస్తాం,ఇవ్వన్నీ మొదటి సంవత్సరం ల్లో నే పూర్తి చేస్తాను, ఆహార ధాన్యం కొరత లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ , కార్యకర్తలు దండలు వేసిన,దండిచ్చిన ఓర్చుకోవలని కుమారుడికి సూచించిన మంత్రి జానారెడ్డి



