- Advertisement -
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సోమవారం హైదరాబాద్లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతు కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పార్లమెంట్ కి పోటీ చేస్తా అని గతంలో అన్నాను. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాను. నా కుమారుడు జై వీర్ కు పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ ను అడగలేదు. ప్రస్తుతం అతడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇంకా జూనియర్. ఇప్పుడే పదవులు అడగలేం. ఇవ్వడం కూడా సమంజసం కాదు అని జానారెడ్డి అన్నారు.
- Advertisement -



