Tuesday, January 21, 2025

కొత్త చర్చకు దారి తీస్తున్న జపాన్ కల్చర్

- Advertisement -

కొత్త చర్చకు దారి తీస్తున్న జపాన్ కల్చర్

Japanese culture leading to a new debate

టోక్యో,  డిసెంబర్ 10, (వాయిస్ టుడే)
ప్రస్తుతం జపాన్ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అందువల్ల, దాని రాజధాని టోక్యో ఈ సమస్యను కొత్త మార్గంలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. అదే వారానికి నాలుగు రోజుల పని విధానం. ఏప్రిల్ నుండి, టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం తన ఉద్యోగులను వారానికి 4 రోజులు మాత్రమే పని చేయడానికి అనుమతించబోతోంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌‌ను ఇంప్రూవ్ చేయడం, కుటుంబ వృద్ధిని ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త విధానాలు వచ్చాయి. ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో జనవరి నుండి జూన్ వరకు 350,074 జననాలు నమోదయ్యాయి. ఇది 2023లో ఇదే కాలానికి సంబంధించిన గణాంకాల కంటే 5.7శాతం తక్కువ. 2023లో జపాన్ మొత్తం సంతానోత్పత్తి రేటు 1.2, టోక్యోలో జనన రేటు 0.99 కంటే తక్కువగా ఉంది. సంతానోత్పత్తి రేటు అనేది స్త్రీ తన జీవితకాలంలో కలిగి ఉన్న పిల్లల సంఖ్యను సూచిస్తుంది.వారానికి నాలుగు రోజుల పని విధానం పని సంస్కృతికి సంబంధించిన కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం.. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(OECD) దేశాలలో ఇంటి పనుల పరంగా పురుషులు, మహిళల మధ్య అంతరం అతిపెద్దది. జపాన్‌లోని స్త్రీలు పిల్లల సంరక్షణ, పెద్దల సంరక్షణ వంటి పనులు పురుషుల కంటే ఐదు రెట్లు ఎక్కువగా జీతం లేకుండా చేస్తారు. అయితే నాలుగు రోజుల పని వారాన్ని వలన పెద్ద సామాజిక మార్పు వచ్చే ఆస్కారం ఉంది. తక్కువ జనన రేటు పరిస్థితిని మార్చే దిశగా జపాన్ తీవ్ర చర్యలు తీసుకుంది. 90వ దశకం నుండి, ప్రభుత్వం కంపెనీలను ఉదారంగా తల్లిదండ్రుల సెలవులను అందించాలని కోరింది.ప్రపంచంలోనే ఎక్కువ యువతను కలిగి ఉన్నది మన దేశమే అని గర్వంగా చెప్పుకోవచ్చు. అందుకే మనది యువ భారతం అంటుంటాం. కష్టపడి పని చేసే యువ జనాభా ఎక్కువగా ఉండటమే మన దేశం బలం. అలాగే అభివృద్ధి చెంది ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన జపాన్ ఇప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతుంటే, జపాన్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. జపాన్‌లో జనాభా వరుసగా 15వ సంవత్సరం కూడా జనాభా భారీగా పడిపోయింది. జననాల సంఖ్య కంటే మరణాల సంఖ్య ఎక్కువ ఆ దేశంలో ఎక్కువగా ఉంది.అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధిత గణాంకాల ప్రకారం దేశ జనాభాలో జపనీయుల సంఖ్య భారీగా తగ్గినట్లు పేర్కొంది. జనవరి 1, 2024 నాటికి జనాభా 12 కోట్ల 49 లక్షలుగా ఉంది. గతేడాది 7 లక్షల 30 వేల మంది జన్మించారు. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 15 లక్షల 80 వేల మంది మరణించారు. 2009 నుండి జనాభా క్రమంగా తగ్గుతోంది. దేశంలో అత్యధిక మరణాల రేటు ఉంది. నవజాత శిశువుల సంఖ్య మరింత తగ్గింది. దేశ జనాభాలో సగానికి పైగా టోక్యో, కనగావా, ఒసాకా, ఐచి, సైతామా, చిబా, హ్యోగో, ఫుకుయోకా ప్రిఫెక్చర్‌లలో నివసిస్తున్నారు. ఈ పెద్ద నగరాల్లో జనాభా గణనీయంగా తగ్గుతోంది.యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపకపోవడమే ఆ దేశంలో జనాభా తగ్గుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. పెళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో జనాభా బాగా తగ్గిపోతుంది. పెరుగుతున్న నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్ష, ఇతర సమస్యలతో దేశ ప్రజలు బాధపడుతున్నారు. పెళ్లిళ్లు, పిల్లలు ఉన్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా యువత నిర్ణయాల్లో పెద్దగా మార్పు రావడం లేదు. అందుకే ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా నవజాత శిశువుల సంఖ్య నామమాత్రంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. 2050 నాటికి జపాన్ తన జనాభాలో 40 శాతం కోల్పోయే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్