జాతీయస్థాయి కరాటె పోటీల్లో జపాన్ సితోరియు కరాటే
మంథని విద్యార్థుల ప్రతిభ
మంథని
Japan’s Shitoriu Karate is a national level karate competition
జాతీయస్థాయి కరాటె పోటీల్లో జపాన్ సితోరియు కరాటే మంథని విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారు. ఆదివారం కరీంనగర్లోని రాజశ్రీ కన్వెన్షన్ హాల్లో గౌరు నారాయణరెడ్డి స్మారకర్థం ఆర్గనైజర్ గౌరు రాజి రెడ్డి నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కరాటే శిక్షకులు,రాష్ట్ర కాయ్ రిఫరీ కమిషన్ కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో జపాన్ షిటోరియు కరాటే అకాడమీ విద్యార్థులు సబ్ జూనియర్స్ గర్ల్స్ మరియు బాయ్స్. కట విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు వెండి పథకాలు, కాంస్య పథకాలు సాధించారు పథకాలు సాధించిన వారిలో కొండ అశ్విని బాబు బంగారు పతకం, కొండ అశ్వితరాణి వెండి పతకం, గంధం లక్ష్మీ ప్రసన్న కాంస్య పథకాలు సాధించారు. పథకాలు సాధించిన వారిని కాయ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆర్గనైజర్ గౌరు రాజిరెడ్డి,జపాన్ సిటోరియు కరాటే జాతీయ ఉపాధ్యక్షులు, కాయ్ రిఫరీ కమిషన్ చైర్మన్ పి పాపయ్య, కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య , కాయ్ రాష్ట్ర అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వి నరేందర్, కోశాధికారి సాయికుమార్, ఇన్స్ట్రక్టర్ నాగేల్లి రాకేష్, జడగాల శివాని, మెట్టు హాసిని లు అభినందించారు.