చాగలమర్రి లో చౌడేశ్వరి అమ్మవారి ఘనంగా జయంతి వేడుకలు………
నంద్యాల
Jayanthi celebrations of Goddess Chowdeshwari.
మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో వెలసిన చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతోత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు విశేషాలంకరణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయం వద్ద తీర్థ ప్రసాదాలు , అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చౌడేశ్వరిదేవి అమ్మవారికి ఆషాడ మాసంలో అమావాస్యరోజున ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహించడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోందని , ఉదయం నుంచి మహిళలు ఉపవాసాలతో దీక్ష చేసి అమ్మ వారికి పొంగళ్లు సమర్పించి బోనం మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు.మహిళల ఆధ్వర్యములో లలితా పారాయణం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు బడిగెంచల రఘురాం ధర్మపత్ని అనుషా , బడిగెంచల చక్రపాణి ధర్మపత్ని మాధవీలత ,