- Advertisement -
అల్ట్రాటెక్ యాజమాన్యానికి జేసీ క్షమాపణ
Jaycee apologizes to Ultratech management
అనంతపురం
అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు బూడిద రవాణా చేసే లారీల విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి జేసీ క్షమాపణ చెప్పారు. ఆదినారాయణరెడ్డితో జరుగుతున్న గొడవతో పరిశ్రమకు, అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు నష్టం జరగకూడదనే సారీ చెబుతున్నట్లు జేసీ పేర్కొన్నారు.తమకు బూడిద రవాణా చేసే పర్మిట్ ఎంతో కాలంగా ఉందని జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. డబ్బుల కోసమే బూడిద రవాణా చేసే లారీలను ఆపామని కొందరు ఆరోపిస్తున్నారని.. దీనిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తాను ఏరోజూ డబ్బు కోసం రాజకీయాలను ఉపయోగించుకోలేదని చెప్పారు. తమకు చెందిన లారీలను అవతలి వ్యక్తులు నిలిపేసి అద్దాలు పగులగొట్టినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో పాటు జెన్‌కో అధికారులుకు కూడా ఫిర్యాదు చేశామన్నారు.
- Advertisement -