జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ పదవి.. సీనియర్ల గుసగుసలు
కరీంనగర్, ఏప్రిల్ 9, (వాయిస్ టుడే )
Jeevan Reddy Gets Secretary-General Post… Murmurs Among Seniors
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ, కష్టకాలంలోనూ పార్టీ జెండా మోసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి.. ఇప్పుడు అదే పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే
సంజయ్ కుమార్ను కాంగ్రెస్ లో చేర్చుకోవడం.. మున్సిపల్ ఎన్నికల ముందే ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం జీవన్ రెడ్డిని తీవ్ర అసహనానికి గురిచేసింది. గెలిచిన నేతలను చేర్చుకుంటూ ఓడిన మమ్మల్ని
అవమానిస్తారా అంటూ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన గులాబీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.బీఆర్ఎస్
అధిష్టానం జీవన్ రెడ్డికి కేకే వదిలిపెట్టిన సెక్రటరీ జనరల్ వంటి కీలక పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పదవిని, కొత్తగా వచ్చిన వ్యక్తికి కట్టబెట్టడంపై
మొదటి నుండి కారు పార్టీని నమ్ముకున్న సీనియర్లలో అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. ఎంతో కాలంగా పార్టీని అంటిపెట్టుకున్న ఇతర ఉమ్మడి కరీంనగర్ నేతలను పక్కనపెట్టి, నిన్నటిదాకా తమను
తిట్టిన నేతకు రెడ్ కార్పెట్ వేయడం ఏమిటని కొందరు నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాయకత్వ సమీకరణాలు పూర్తిగా
మారిపోనున్నాయి. ఇప్పటికే జిల్లాలో గంగుల కమలాకర్ వంటి బలమైన నేతలు ఉండగా, ఇప్పుడు జీవన్ రెడ్డి వంటి దిగ్గజం చేరడం ఆధిపత్య పోరు కు దారితీయవచ్చు. ముఖ్యంగా జగిత్యాలలో బీఆర్ఎస్
శ్రేణులు ఇప్పుడు ఎవరి కింద పనిచేయాలన్న గందరగోళంలో ఉన్నాయి. నిన్నటిదాకా కొట్టుకున్న వర్గాలు ఇప్పుడు ఒకే జెండా కింద ఎలా కలిసి సాగుతాయన్నది పెద్ద ప్రశ్న. జగిత్యాల నియోజకవర్గంలో
జీవన్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ బీఆర్ఎస్కు బలంగా మారవచ్చు కానీ, అది పాత క్యాడర్లో చీలిక తెచ్చే ప్రమాదం ఉంది. సంజయ్ కుమార్ వైఖరికి వ్యతిరేకంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తుండటంతో,
స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉంది. ఎన్నో అవకాశాలు వచ్చినా గెలవని జీవన్ రెడ్డిని చేర్చుకోవడం వల్ల పార్టీకి లాభమా లేక నష్టమా అనే
చర్చ బీఆర్ఎస్లో జరుగుతున్నా, ఆయన అనుభవం పార్టీకి అవసరమని అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. అయితే, ఈ నిర్ణయం కరీంనగర్ గులాబీ తోటలో ముళ్లు జల్లినట్టే అవుతుందన్నది విశ్లేషకుల
అంచనా. జీవన్ రెడ్డికి అంత ప్రజాబలం లేదని.. అయనకు బదలుగా యువనేతల్ని ప్రోత్సహిస్తే మంచిదని.. గతంలో కేకేను ప్రోత్సహిస్తే ఏం జరిగిందో తెలుసుకదా అని క్యాడర్ ప్రశ్నిస్తున్నారు.
మరో వైపు
ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో జీవన్ రెడ్డి టచ్లో ఉన్నారు. ఒక దఫా ప్రాథమిక చర్చలు కూడా ముగిసినట్లు జీవన్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. జీవన్ రెడ్డికి పార్టీలో
కీలక పదవి.. ఆయన కోడలికి జగిత్యాల టికెట్ లాంటి అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి సీనియార్టీకి తగిన పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయన కోరిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు
బీఆర్ఎస్ అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్కు గుడ్బై చెప్పాక తన అనుచరులతో
సుదీర్ఘ చర్చలు జరిపారు. కొంత మంది అనుచరులు బీజేపీ వైపు వెళ్దామని సలహా ఇచ్చినప్పటికీ తనకున్న ముస్లిం అనుచరులు, మైనార్టీ ఓటు బ్యాంక్ దృష్ట్యా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లు
తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావులతో చర్చల అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరే తేదీ ఖరారు కానుంది



