11.1 C
New York
Thursday, February 29, 2024

కేసీఆర్ కు ఝలక్ ఇవ్వాలి

- Advertisement -

కేసీఆర్ మళ్లీ వస్తే అప్పుల పాలే

మహబూబ్ నగర్, ఆగస్టు 23: కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. చివరకు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల రక్తాన్ని కేసీఆర్ కుటుంబం కూడా తింటుందని జూపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని కేసీఆర్ కు అర్థమైందని… అందుకే రెండు చోట్ల పోటీకి సిద్ధమయ్యారని జూపల్లి అన్నారు. కేసీఆర్ ఓటమిని ముందే అంగీకరించారని అన్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు గజ్వేల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని… అందుకే కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. అక్రమంగా సంపాదించిన వందల కోట్లు ఖర్చు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలిచే పరిస్థితి లేదని… కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కడతారని జూపల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. లేనిపక్షంలో బీఆర్ ఎస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇప్పుడు వాగ్దానాలు చేస్తున్న కేసీఆర్.. గెలిచాక వాటిని మర్చిపోయే రకం అని అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని జూపల్లి అన్నారు. మంత్రి హరీశ్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుమల సాక్షిగా బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తిరుగుబాటు చేశారని జూపల్లి అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా తాండూరు టికెట్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిద్దరూ తమ సత్తా చాటేలా కేసీఆర్ కు ఝలక్ ఇవ్వాలని జూపల్లి సూచించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదాల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని… అయితే ఇది ఆ పార్టీలో ప్రజాస్వామ్యానికి నిదర్శనమని జూపల్లి అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్‌ను ఓడించడం ఖాయమన్నారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అవినీతి, అక్రమాలన్నీ బయటపడతాయన్నారు.

Jhalak should be given to KCR
Jhalak should be given to KCR

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!