Sunday, September 8, 2024

జీహాదీల దిష్టిబొమ్మ దగ్దం

- Advertisement -

విహెచ్పి– భజరంగదళ్ ఆధ్వర్యంలో రాస్తారోకో తో నిరసన

Jihadist effigy Dagdam
Jihadist effigy Dagdam

హైదరాబాద్: విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చౌరస్తా లో జీహాదీల దిష్టిబొమ్మ దగ్దం చేసారు.

హర్యానాలోని మేవాత్లో సోమవారం రోజున హిందువులపై జరిగిన దాడులను నిరసిస్తూ విహెచ్పీ జాతీయ కమిటి ఇచ్చిన దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలలో భాగంగా బుధవారం ఎల్బీ నగర్ లోని చంపాపేట్ చౌరస్తాలో రాస్తారోకో   కార్యక్రమాన్ని నిర్వహించి జీహాదీల దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్.రావినూతల శశిధర్  మాట్లాడుతూ  “ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో సోమవారం నాడు భక్తులు మేవాత్లోని మహాభారత కాలం నాటి ఐదు దేవాలయాలను సందర్శించి శంకర్ భగవంతుని ఆశీస్సులు పొందుతారని తెలిపారు.సోమవారం దాదాపు 25 వేల మంది హిందూ భక్తులు పాల్గొన్న యాత్రపై   జీహాదీ శక్తులు బుల్లెట్లు గురిపెట్టడం, రాళ్లు విసరడం, వాహనాలు దహనం చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు,  పక్కా ప్రణాళికా ప్రకారం యాత్ర వెనుక నుంచి రాళ్ల వర్షం కురిపించి, భక్తులపై పెట్రోలు బాంబులు విసిరారని ఆరోపించారు.  స్థానిక విహెచ్పీ కార్యకర్తలు కొంత మంది  భక్తులను రక్షించి నల్హాద్ మహాదేవ్ ఆలయానికి తీసుకురాగలిగారని.  ఆ గుడి ముందు నుంచి కూడా అల్లరి మూకలు దాడిచేశారని.  కార్లు, బస్సులు, ఇతర వాహనాలకు నిప్పుపెట్టి, ఎదురుగా ఎవరు కనిపించినా తూటాలు పేల్చారని.  ఇద్దరికి బుల్లెట్లు గాయాలయ్యాయని. ఆ ప్రాంతంలోని దాదాపు అన్ని వాహనాలు దగ్ధమయ్యాయి లేదా ధ్వంసమయ్యాయని.  పోలీసులు రావడంతో పోలీసులను చూసి దుండగులు పారిపోయి కొండలు ఎక్కి ఆలయంలో తలదాచుకున్న మహిళలు, చిన్నారులు, ఇతర భక్తులపై మూడు వైపుల నుంచి కాల్పులు జరిపగా అనేక మంది హిందువులు గాయపడటం జరిగిందని తెలిపారు. మేవాత్ మొత్తం మినీ పాకిస్థాన్గా మారిందని దేవాలయాల పైన మరియు పోలీసు ఔట్పోస్టులపై కూడా దాడులు చేశారు.

ఈ అల్లర్లను ప్రేరేపించిన  జీహాదీ వ్యక్తులే ఈ ఘటనకు బాధ్యులని, వారి ప్రోద్బలంతో శ్రీరామ నవమి రోజున  కూడా  ఈ ప్రాంతంలో దాడులు చోటు చేసుకున్నాయి. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించేందుకు  విహెచ్పీ ఏర్పాట్లు చేస్తుంది , భక్తులను రక్షించేందుకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు బలగాలు పంపాలని విహెచ్పి– డిమాండ్ చేసింది . హర్యానా  లోని మేవత్ మరియు నోహ్లో డైరెక్ట్ యాక్షన్ తరహా వాతావరణం సృష్టించబడటం తీవ్రమైన ఆత్మపరిశీలనకు సందర్భమని , చిన్న పిల్లలకు కూడా దాడులు చేయడం, నిప్పు పెట్టడం లాంటి శిక్షణ ఇస్తున్న జీహాదీ శక్తులు ఎలాంటి భవిష్యత్తును సృష్టిస్తున్నారో దేశ ప్రజలు ఆలోచించాలని విహెచ్పి– తెలియజేస్తుంది . ఈ దుర్మార్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించలేది లేదని హిందూ సమాజానికి రక్షణగా నిలుస్తుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్