పెద్ద కల్వలలో నిరుద్యోగ విజయోత్సవ సభ
Jobless victory meeting in Pedda Kalvala
– ముఖ్యమంత్రి పర్యటనకు సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
పెద్దపల్లి
నిరుద్యోగ యువతతో వచ్చే నెల 4న పెద్దపల్లిలో జరుగునున్న విజయోత్సవ సభను ఏర్పాటు చేయాడానికి పెద్ద కల్వలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో స్థలాన్ని శుభ్రం చేయాలని, రేపు ఉదయం స్టేజ్ ఏర్పాటు కోసం హైదరాబాద్ నుంచి బృందం వస్తుందని అన్నారు. డిసెంబర్ 4న పెద్దపెల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరగనుందని అన్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ నిరుద్యోగ విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని, ఈ సభలో గ్రూప్ 4, ఇతర వివిధ పోటీ పరీక్షలకు కింద ఎంపికైన 9 వేల మది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు పెద్ద కల్వలోనే ఖాళీ స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉంటూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసిల్దార్ రాజ్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ భావ్ సింగ్ తోపాటు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.