జూబ్లీహిల్స్ లో రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం.కేసు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని నిందితుడిగా చేర్చిన జూబ్లీ హిల్స్ పోలీసులు..
రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో ప్రమాదం.
బెలూన్లు అమ్ముతూ
రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను ఢీకొట్టిన కారు.
చేతిలోని రెండు నెలల శిశువుని వదిలి పెట్టిన కాజోల్.
చేతిలోంచి కిందపడడంతో మృతి చెందిన కాజోల్ రెండు నెలల కొడుకు రణ్వీర్.
ఘటనలో గాయపడిన కాజోల్.
ప్రమాదం జరగగానే సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ముగ్గురు వ్యక్తులు.
కారుపై స్టిక్కర్ ఆధారంగా అది ఎమ్మెల్యే షకీల్ కు చెందినదిగా గుర్తించి ఘటనపై ఐ పీ సీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.
ఘటన సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.
సీసీ ఫుటేజ్ కోసం చూడగా లభ్యం కానీ ఫుటేజ్.
కారు ఎవరు నడిపారు అన్నదానిపై అప్పట్లో లభించని స్పష్టత.
కారు తానే నదిపాను అంటూ పోలీసులకు లొంగిపోయిన ఆఫ్నాన్ అనే యువకుడు.
అకస్మాత్తుగా కాజోల్ రోడ్డు మీదకు రావడంతో కారు ఢీకొట్టిందనీ, భయంతో కారులో ఉన్న ముగ్గురం పారిపోయినట్లు వాంగ్మూలం ఇచ్చిన ఆఫ్నాన్
దాంతో కేసులో ఆఫ్నాన్ ను నిందితుడిగా పేర్కొని అరెస్ట్ .
ఈ మేరకు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు.
తాజాగా షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు.
బాధితురాలు కాజోల్ వాంగ్మూలంతో పాటు లొంగిపోయిన ఆఫ్నాన్ వాంగ్మూలం సేకరించిన పోలీసులు.
కారు నడిపింది షకీల్ కొడుకు రాహెల్ అంటూ వారు చెప్పడంతో 304 పార్ట్ 2 గా సెక్షన్ల మార్పు.
కేసును మరోసారి దర్యాప్తు చేయనున్న జూబ్లీ హిల్స్ పోలీసులు.




