ఉద్యమకారులకు న్యాయం చేయాలి
Justice should be given to the activists– ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్, జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్
పెద్దపల్లి ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాడిన ఉద్యమకారులకు న్యాయం జరగాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్, జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ ఆకాంక్షించారు. పెద్దపల్లి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సోమవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉద్యమ కళాకారులకు, ఇంటి స్థలాలు, రూ. 25 వేల పెన్షన్, బస్సు పాస్, హెల్త్ కార్డ్ తోపాటు జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా అన్ని సంక్షేమ పథకాలలో 20 శాతం వాటా ఇస్తామని చెప్పినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం, ఉత్తర తెలంగాణ కన్వీనర్ బత్తుల శంకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు డబ్బేట చంద్రకళ, తాడూరి శ్రీమాన్, రాష్ట్ర కార్యదర్శి కందుల సదాశివ్, రాష్ట్ర సెక్రటరీ బింగి రాజు, పెద్దపల్లి ఉపాధ్యక్షులు మంద భాస్కర్ యాదవ్, మూల మల్లేశం, చింతకుంట వెంకటరెడ్డి, చర్లపల్లి సురేష్, గోష్కల రమేష్, కళా విభాగం జిల్లా అధ్యక్షులు తూండ్ల రాజయ్య, దుబాసి శ్రీనివాస్, బందరు సంపత్, తూముల నంబారావు, శ్రీనివాస్, బూర్ల ధనంజయ్, కల్వల తిరుపతి, దామ సదయ్య, తిరుపతి, సదానందం, తిరుపతి, చంటి నర్సక్క, కర్నాటి సీతక్క, లలితా ఠాగూర్, జ్యోతి ఠాగూర్, బొరగాని విద్యాసాగర్, రూప ఠాగూర్, గుజ్జుల పద్మ, రౌతు సందీప్, సంజయ్, అజయ్ కుమార్, మల్లేశం, కల్వల రవీందర్, అడ్లూరి హరిత, కలవల శంకర్, తదితరులు పాల్గొన్నారు.




